Site icon Prime9

Pawan Kalyan Press Meet: శాంతియుతంగా నిరసన చేయడం ప్రజల హక్కు.. దాన్నికాదనే అధికారం ఎవరికీ లేదు- పవన్ కళ్యాణ్

pawan kalyan

pawan kalyan

Pawan Kalyan Press Meet: జనసేన కార్యకర్తపై చేయిచేసుకున్న ఘటనలో స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పై పవన్ తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సీఐ అంజూయాదవ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. సీఐ అంజూయాదవ్ చేతిలో దెబ్బలు తిన్న కొట్టే సాయితో పాటు మరో ఆరుగురితో కలిసి పవన్ కళ్యాణ్ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని కలుసుకుని ఫిర్యాదు అందజేశారు.

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ నిర్వహించిన ఆందోళనలో సీఐ అంజూ యాదవ్ కార్యకర్తలతో ప్రవర్తించిన తీరు అందరికీ విదితమే. నిరసనకారులను అదుపుచేసే క్రమంలో జనసేన లీడర్ కొట్టె సాయిపై  ఆమె కోపోద్రేకంతో చేయిచేసుకున్నారు. ఇతర కార్యకర్తలు, అభిమానులపైనా తీవ్రంగా మండిపడ్డారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ కాస్త మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ ఘటనపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. తిరుపతి చేరిన పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇది కేవలం కొట్టే సాయి సమస్యే కాదని ప్రతి ఒక్కరి సమస్యగా భావించాలని ఆయన పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన చేయడం ప్రజల హక్కు అని వారి హక్కులను కాలరాసే విధంగా శ్రీకాళహస్తి సీఐ ప్రవర్తించడం సమంజసం కాదని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. జనసేన ప్రభుత్వంలోకి వస్తే ప్రజలకు తప్పు జరిగితే నిలచేసే హక్కు ఉంటుందని వారి హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తిస్తే ఎవరినైనా సరే గల్లాపట్టుకుని నిలదీయాలని అన్నారు.

LIVE🔴-JanaSena Chief Sri Pawan Kalyan || Press Meet || Tirupati || JanaSena Party || Prime9 News

 

 

 

Exit mobile version
Skip to toolbar