Pawan Kalyan: 74వ గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరి వేదికగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
నేరాలు లేని ఆంధ్రప్రదేశ్ ను చూడడమే జనసేన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
వారాహిని ఏపీలో తిరగనివ్వమని.. పేట్రేగిపోయారు అసలెలా వస్తావో చూస్తానన్నారు..
కానీ, అన్ని రూల్స్ ప్రకారమే ఎంతో ధైర్యంగా వేలాదిమంది ప్రజల ఆశీర్వాదాలు, అభిమానుల ప్రోత్సాహం నడుమ వారాహికి దుర్గమ్మ సన్నిధిలో పూజలు నిర్వహించాను.
వారాహిపై సింహంలా ఏపీలో తిరిగాను అంటూ స్పష్టం చేశారు. నేను మీలాగా కోడికత్తి డ్రామాలు చెయ్యము అంటూ వైసీపీ నేతలను, సీఎం జగన్ ను ఉద్దేశించి ఆయన విమర్శలు చేశారు.
విశాఖ ఉక్కు జోలికొస్తే ఊరుకునేది లేదు..
నేను భవానీ మాత భక్తుడిని.. ఎన్నో రోజులుగా దుర్గమ్మను దర్శించుకుందామనుకుంటే కుదరలేదని..
కానీ, దుర్గమ్మే వచ్చి నన్ను దర్శించుకో అని చెప్పినట్టు అనిపించిందని..
దానితో తాను వెంటనే వారాహికి అక్కడే పూజలు నిర్వించి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని పవన్ చెప్పారు.
వారాహితో ఏపీలో తిరుగుతాను మమ్మల్నెవడ్రా ఆపేది అంటూ చెప్పుకొచ్చారు.
వారాహి జోలికొచ్చి.. నువ్ నాతో గొడవపెట్టుకో చెప్తా అంటూ జగన్ కు వార్నింగ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వార్నింగ్ ఇచ్చారు.
వైసీపీ నేతలకు ఇంకాస్త మదమ్మెక్కనివ్వండి వారాహితో కొడదామని ఆయన హెచ్చరించారు. బలిసిన పొట్టేల్నే కదా కొడతామంటూ విరుచుకుపడ్డారు.
వేర్పాటు వాద ధోరణితో విసిగిపోయాం..
వైసీపీ ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
లాస్ట్ టైం ప్రధానిని కలిసినప్పుడు ఏం మాట్లాడావ్ ఏం మాట్లాడావ్ అని సజ్జల తెగ ఉత్సుకత ఊపించారు. ఈ సారి ప్రధానిని కలిస్తే కచ్చితంగా జగన్ పై ఓ కంప్లైంట్ ఇస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు
వేర్పాటు వాద ధోరణితో విసిగిపోయామని రాష్ట్రాన్ని ముక్కులుగా చేస్తుంటే చూస్తూ కూర్చోమని పవన్(Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వేర్పాటు వాద ధోరణిని మార్చుకోకపోతే నాలాంటి తీవ్రవాదిని ఇంకొకరిని చూడరు అంటూ ఆయన హెచ్చరించారు.
రాష్ట్రాన్ని మంత్రుల కోసం పంచలేమని రాష్ట్రం కోసం ఎందరో ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడారని ఆయన గుర్తుచేశారు.
విశాఖ ఉక్కు జోలికొస్తే ఊరుకునేది లేదని బల్లగుద్ది చెప్పారు.
ఈ వైసీపీ సన్నాసుల ఆలోచనలు భావజాలంతో విసిగిపోయామని.. ఈ ధోరణిని మార్చుకోకపోతే తోలుతీసి కూర్చోబెడతాం అని ఆయన పేర్కొన్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/