Pawan Kalyan: ఇటీవలే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీకి పట్టభద్రులు తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలే పునారవృతం అవుతాయని వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి పట్టభద్రులు తగిన కనువిప్పు కలిగించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారం తలకెక్కిన వైకాపా నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా బుద్ది చెప్పారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఇలాంటి వ్యతిరేక ఫలితమే వైసీపీ కి ఎదురవుతుందని వ్యాఖ్యనించారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికార దాహంతో అనేక దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రభుత్వం ఉన్న వ్యతిరేకతను తేటతెల్లం చేశాయని విమర్శించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మార్గదర్శకులుగా పట్టభద్రులు నిలిచారని వారిని పవన్ ప్రశంసించారు.
ఈ ఫలితాలు వైకాపా ప్రభుత్వానికి హెచ్చరికలుగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదని ప్రకటనలో పేర్కొన్నారు.
అధికారం తలకెక్కిన వైకాపా నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారు. సందిగ్ధంలో ఉన్న వారికి ఈ ఎన్నిక ద్వారా పట్టభద్రులు దారి చూపారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న తీరుకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా నిరసన తెలిపారు. ఈ ఫలితాలు ప్రజల ఆలోచన ధోరణిని తెలియజేస్తున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇలాంటి వ్యతిరేక ఫలితమే ఉంటుంది. ప్రజాకంటక పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు అని పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీ శాసనమండలిలో 3 పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైకాపా పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల్లో తెదేపా ఘన విజయం సాధించిన విషయం తెలసిందే.