Pawan Kalyan: ఈనెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ సీపీ అరాచక పాలనపై యుద్ధం ప్రకటించేందుకు జనసేన( JanaSena) అధినేత పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు.
‘నేను సిద్ధం.. జన సైనికులారా మీరు సిద్ధమా!’ అని పవన్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.
ఈ క్రమంంలో శనివారం మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మంగళగిరి చేరుకున్నారు.
ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న ఆయన అక్కడి నుంచి నేరుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు.
పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీసీ సదస్సులో పవన్ పాల్గొన్నారు.
ఎన్నికల్లో పావులుగా బీసీలు: నాదెండ్ల(Pawan Kalyan)
జనసేన పార్టీ మొదటి నుంచి బీసీ వర్గాలకు సముచిత గౌరవం ఇస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తోంది. జాతీయ స్థాయిలో బీసీ జనగణన జరగాలి.
అప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుంది. బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలకు జనసేన పరిష్కారం చూపుతుంది.
మీ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పనిచేసేందుకే బీసీ సదస్సు ఏర్పాటు చేశాం.
56 కుల సంఘాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు తప్ప, వాటి ద్వారా కులాలకు జరిగిన లాభం శూన్యం.
ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే బీసీలను వాడుకుంటున్నారు’ అని బీసీ సదస్సులో పాల్గొన్న నాదెండ్ల మనోహర్ అన్నారు.