Site icon Prime9

Pawan Kalyan : విష ప్రచారానికి చెంప చెల్లుమనేలా కౌంటర్ ఇచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్..

pawan kalyan counter to fake news about divorce with anna lezinova

pawan kalyan counter to fake news about divorce with anna lezinova

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అధికార పార్టీ నేతలు విమర్శలు చేయడం.. వాటికి తనదైన శైలిలో పవన్ రిప్లై ఇవ్వడం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా కళ్యాణ్ తన మూడో భార్య అన్నా లెజినోవాతో విడిపోయారనే విష ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది. ఇప్పటికే వాళ్లిద్దరూ  దూరంగా ఉంటున్నారని, త్వరలోనే లీగల్‌‌గా విడిపోనున్నారనేది ఆ వార్తల సారాంశం. సోషల్ మీడియాతో పాటు పలు సైట్లలో కూడా ఈ విష ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి జనసేన పరోక్షంగా చెక్ పెట్టింది.

ఒక మాట అనకుండా.. కేవలం ఒకే ఒక్క ఫోటోతో వారి చెంపలు చెల్లుమనిపించేలా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా పవన్ – అన్నా కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేశారు. వారాహి మొదటి విడత విజయవంతంగా పూర్తైనందున పవన్ దంపతులు తమ ఇంట్లో పూజలు నిర్వహించారు. అదే విధంగా కొన్ని రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ త్వరలో మంగళగిరి చేరుకుంటారు అని కూడా రాసుకొచ్చారు. అయితే ఏపీ పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా మారుతున్న పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను జనాల్లో తగ్గించేందుకే ఈ ఫేక్ వార్తలను పాల్పడుతున్నారని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 

Exit mobile version