Site icon Prime9

Nara Chandrababu Naidu : చంద్రబాబు నాయుడుకి బెయిల్ ఇవ్వడం పట్ల పవన్, లోకేష్ ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే..?

pawan kalyan and nara lokesh comments on Nara Chandrababu Naidu bail

pawan kalyan and nara lokesh comments on Nara Chandrababu Naidu bail

Nara Chandrababu Naidu : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో 52 రోజులుగా ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఈరోజు సాయంత్రం జైలు నుంచి బయటకు రానున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావటంపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన జైలు నుంచి విడుదల కోసం కోట్లాదిమంది ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం అని అన్నారు. చంద్రబాబు ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షించారు. అందరం ఆయన్ని స్వాగతిద్దాం అంటూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

 

అలానే నారా లోకేశ్ ఆయన భార్య బ్రాహ్మణితో కలిసి రాజమండ్రికి ఉదయాన్నే చేరుకున్నారు. ఇదే విషయంపై లోకేశ్ మాట్లాడుతూ.. యుద్ధం ఇప్పుడే ప్రారంభమైందన్నారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరుపై ఆనందం వ్యక్తం చేస్తు తెదేపా నేతలు లోకేశ్ కు అభినందనలు తెలిపారు. చంద్రబాబును ఉండవల్లి లోని ఇంటికి తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. చంద్రబాబు బయటకు రానుండటంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా జైలు వద్దకు చేరుకున్నారు. చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు.

Exit mobile version