Prime9

Minister Roja: మంత్రి రోజాకు షాక్ ఇచ్చిన వైసీపీ జెడ్పీటీసీ

Andhra Pradesh: ఏపీ మంత్రి ఆర్కే రోజా కాసేపట్లో ప్రారంభించనున్న గ్రామ సచివాలయ భవనానికి వైసీపీ జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి తాళం వేయడం సంచలనం కలిగించింది. సచివాలయ నిర్మాణానికి 25 లక్షలు ఖర్చు చేశానని, ఇప్పటి వరకూ బిల్లులు మంజూరు కాలేదంటూ ఆయన తెలిపారు. అయితే కావాలనే ఇలా చేస్తున్నారంటూ మురళిదర్ రెడ్డి పై రోజా అనుచరులు దాడి చేసారు. సచివాలయ తాళాన్ని పగలగొట్టి మురళీధర్ రెడ్డిని పక్కకు లాగేసారు. పోలీసులు రంగప్రవేశం చేసి మురళీధర్ ను స్టేషన్ కు తరలించారు.

మరోవైపు జెడ్పీటీసీ తీరు పై రోజా ఆగ్రహం వ్యక్తం చేసారు. సమస్యలేమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అంతేకాని ఇలాంటివి చేస్తే పార్టీకి నష్టం కలుగుతుందని మండిపడ్డారు. సచివాలయానికి తాళం వేస్తే సమస్య పరిష్కారమవుతుందా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Exit mobile version
Skip to toolbar