Site icon Prime9

NIA Raids: కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఎన్ఐఏ సోదాలు

NIA searches in Kurnool and Guntur districts

NIA searches in Kurnool and Guntur districts

Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో కరాటే శిక్షణ పేరుతో ఉగ్రవాదం వైపు యువతను మళ్లిస్తున్న సంస్ధల్లో ఒకటైన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) కార్యకలాపాల పై మరోమారు నేషనల్ ఇన్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో గత అర్ధరాత్రి నుండి సోదాలు సాగుతున్నాయి. కర్నూలు ఖడక్ పూర్ వీధిలో చేపట్టిన సోదాల్లో ఎస్డీపీఐ నాయకుడి ఇంట్లో కొత్త కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. గుంటూరులోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు చేస్తూ పిఎఫ్ఐ మూలాలను వెలికితీసే పనిలో ఉన్నారు.

గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పిఎఫ్ఐ ఉగ్రవాద చర్యల పై ఎన్ఐఏ దాడులు చేపట్టిన సంగతి విధితమే. ఉగ్రవాద చర్యలకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వం వారికి సహకరిస్తుందని భాజాపా నేతలు ఆరోపణలు సైతం గుప్పించారు. తాజాగా ఏపీలో కొనసాగుతున్న ఎన్ఐఏ సోదాల్లో మరిన్ని విషయాలు బయటపడనున్నాయి.

Exit mobile version