Andhra Pradesh: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ వ్రాశారు. కోట్ల రూపాయల నిధులను ఇతర ఖాతాల్లోకి మళ్లించడంతో సర్పంచులు పాలనను గాలి కొదిలేశారని పేర్కొన్నారు.
ఆందోళనలకు దిగిన సర్పంచ్ ను అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14, 15వ ఆర్ధిక సంఘం ద్వారా రాష్ట్రానికి వచ్చిన నిదుల్లో రూ. 7,660 కోట్లను పంచాయితీ ఖాతాల నుండి దారి మళ్లించారని ఆరోపించారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన రూ. 948కోట్లను కూడా సీఎం జగన్ పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
పంచాయితీ ఖాతాల నుండి మళ్లించిన సొమ్మును వెంటనే జమ చేయడంతో పాటు సర్పంచుల పై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: ఈఎన్ సి దెబ్బకి ఉదయాన్నే గూబ గుయ్యిమని ఉంటుందే.. సీఎం జగన్ పై లోకేష్ సెటైర్లు