Nara Lokesh: 3500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఎలుకలు కొట్టేశాయా? ఉడతలు ఊదేశాయా.. నారా లోకేష్

మార్కెట్లో కిలో 20 రూపాయలకు పైనే అమ్ముతున్న టమోటా, రైతు దగ్గర కిలో రూ.1కే కొంటుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని మాజీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు.

  • Written By:
  • Publish Date - November 17, 2022 / 12:45 PM IST

Andhra Pradesh: మార్కెట్లో కిలో 20 రూపాయలకు పైనే అమ్ముతున్న టమోటా, రైతు దగ్గర కిలో రూ.1కే కొంటుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని మాజీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. అన్నదాతకు అన్యాయం చేయడమేనా రైతురాజ్యం? మీరు పెట్టిన ధరల స్దిరీకరణ నిధి ఎలుకలు కొట్టేశాయా? ఉడతలు ఊదేశాయా? అంటూ ట్వీట్ చేసారు.

జవాబు చెప్పండి జగన్ గారూ, టమోటా అమ్మబోతే అడివి, కొనబోతే కొరివిలా ఉంటే, అన్నదాతలని ఆదుకుంటానంటూ మాటిచ్చి తప్పిన ముఖ్యమంత్రి ఏ పరదాల మాటున దాక్కున్నారు? మార్కెట్లో కిలో 20 రూపాయలకు పైనే అమ్ముతున్న టమోటా, రైతు దగ్గర కిలో రూ.1కే కొంటుంటే అన్నింటికీ జిందా తిలిస్మాత్ లా పనిచేస్తాయని చెప్పిన జగన్ నాటక రైతు భరోసా కేంద్రాలు ఏం చేస్తున్నాయి? విత్తనం నుంచి విక్రయం వరకూ అన్నదాతకు అన్యాయం చేయడమేనా ముఖ్యమంత్రి గారూ మీరు తీసుకొచ్చిన రైతు రాజ్యం?మీరు పెట్టిన 3500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఎలుకలు కొట్టేశాయా? ఉడతలు ఊదేశాయా? అంటూ నారా లోకేష్ ట్వీట్ చేసారు.