Site icon Prime9

Nara Lokesh: జగన్ అడ్డాలో నారాలోకేశ్.. పోలీసుల భారీ బందోబస్తు

nara lokesh reached kadapa

nara lokesh reached kadapa

Nara Lokesh: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్, జగన్ అడ్డాలో కోలుమోపాడు. చంద్రబాబు తనయుడు, యువ నాయకుడు అయిన నారా లోకేష్ కడపకు చేరుకున్నారు. లోకేశ్ వస్తున్న సంగతి తెలిసిన తెదేపా పార్టీ శ్రేణులు కడప విమానాశ్రయం వద్దకు భారీగా చేరుకున్నాయి. లోకేశ్కు జనం నీరాజనం పట్టారు.

కడప ఎయిర్ పోర్టు వద్దకు చేరుకున్న ఆయనకు జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి కడప సెంట్రల్ జైలుకు లోకేశ్ రోడ్డు మార్గంలో చేరుకున్నారు. జైల్లో ఉన్న టీడీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డిని నారాలోకేశ్ పరామర్శించనున్నారు. ప్రవీణ్ రెడ్డితో ములాఖత్ అయ్యేందుకు నారా లోకేశ్ తో పాటు మరో 17 మంది నేతలకు జైలు అధికారులు అనుమతినిచ్చారు. మరోవైపు, నారా లోకేశ్ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.

ఇదీ చదవండి: పవన్ పట్ల పోలీసుల తీరు కిరాతకం.. సోము వీర్రాజు

Exit mobile version