Site icon Prime9

Nara Lokesh : చంద్రబాబు అరెస్ట్ పై నారా లోకేష్ ఫస్ట్ రియాక్షన్.. తండ్రిని చూడడానికి కొడుకు వెళ్లకూడడా అంటూ ఫైర్ !

nara lokesh fires on ycp government about chandrababu arrest

nara lokesh fires on ycp government about chandrababu arrest

Nara Lokesh : తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడంపై ఆయన తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. కాగా ప్రస్తుతం నారా లోకేష్ పాదయాత్ర కోనసీమ జిల్లా రాజోలు మండలంలో పొదలాడలో కొనసాగుతుంది. అయితే చంద్రబాబు అరెస్ట్ వార్త తెలుసుకున్న లోకేష్ పొదలాడ యువగళం క్యాంప్ సైట్ నుంచి విజయవాడ బయలుదేరేందుకు సిద్దమయ్యారు. అయితే లోకేష్ అక్కడి నుంచి వెళ్లకుండా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో లోకేష్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నేల మీదే బైఠాయించి నిరసన తెలిపారు.

ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని నేరుగా ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. పిచ్చోడు లండన్ కి.. మంచోడు జైలుకి.. ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం అంటూ విమర్శలు గుప్పించారు. ఇక చంద్రబాబు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు లోకేష్ ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో లోకేష్ వాగ్వాదానికి దిగారు. తన వెంట ఎవరూ రావడం లేదని, కుటుంబ సభ్యుడిగా తాను ఒక్కడినే వెళ్తానని, అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటూ నిలదీశారు. దీంతో క్యాంప్ సైట్ వద్ద బస్సు ముందే బైఠాయించి లోకేష్ నిరసన తెలుపుతున్నారు. తన పాద‌యాత్ర‌పై వైకాపా రౌడీమూక‌ల‌తో ద‌గ్గ‌ర ఉండి రాళ్లు పోలీసులు రాళ్లు వేయించారని, యువ‌గ‌ళం వ‌లంటీర్ల‌పై ఎటాక్ జ‌రిగింద‌ని ఫిర్యాదులు ఇస్తే, రివ‌ర్స్ కేసులు వారిపైనే బ‌నాయించిన పోలీసులు తనకు ర‌క్ష‌ణ క‌ల్పిస్తార‌నడం సిగ్గు చేటని లోకేష్ అన్నారు.

 

చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా లోకేష్ నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు బస్సులోకి వెళ్లాలని సూచించగా.. లోకేష్ (Nara Lokesh) రాజ్యాంగంలోని నిబంధనలను చదివి వినిపించారు. ఈ క్రమంలోనే పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి నోటీసులు లేకుండా లోకేశ్ ను పోలీసులు అడ్డుకోవడం పట్ల టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. లోకేశ్ వద్దకు మీడియాను కూడా అనుమతించడంలేదని సమాచారం. పోలీసుల తీరు పట్ల టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

 

 

Exit mobile version