Nara Lokesh: పేటీఎం డాగ్స్! దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు.. నారా లోకేష్

 టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వైసీపీ తరచుగా చేసే విమర్శల్లో ముఖ్యమైనది ఏమిటంటే మామకు వెన్నుపోటు పొడిచాడు. అయితే తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ వెన్నుపోటు విమర్శల పై గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

  • Written By:
  • Publish Date - September 26, 2022 / 12:41 PM IST

Andhra Pradesh: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వైసీపీ తరచుగా చేసే విమర్శల్లో ముఖ్యమైనది ఏమిటంటే మామకు వెన్నుపోటు పొడిచాడు. అయితే తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ వెన్నుపోటు విమర్శల పై గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జగన్ గురించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడిన పాత వీడియోను లోకేష్ ట్వీట్ చేశారు. ఇది నిజమైన వెన్నుపోటు అంటూ మండిపడ్డారు.

పేటీఎం డాగ్స్! దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి అవినీతి కేసుల్లో వైఎస్సార్ ని ముద్దాయిని చేసింది దుర్మార్గపు కొడుకు జగన్ రెడ్డి. మీలా ఆధారాలు లేని ఆరోపణలు చెయ్యడం లేదు. పక్కా ఆధారాలతో బయటపెడుతున్నా. వైఎస్సార్ ని ప్రథమ ముద్దాయిని చేసింది అబ్బాయ్ జగన్ రెడ్డే అంటూ లోకేష్ ఘాటుగా స్పందించారు. గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక టీవీ చానల్ లో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. వైఎస్సార్‌ను జగన్ ముద్దాయిని చేశారంటూ మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.