Site icon Prime9

Nara Chandrababu Naidu : స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరు.. ఎన్ని రోజులంటే ?

Nara Chandrababu Naidu got bail in skill development case

Nara Chandrababu Naidu got bail in skill development case

Nara Chandrababu Naidu : తెదేపా అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. గత నెల రోజులకు పైనుంచి ఆయన రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులో ఉంటున్నారు. మరోవైపు తనపై సీఐడీ నమోదు చేసిన కేసులు తప్పు అని, వాటిని కొట్టేయాలని సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఇంకా విచారణ దశలోనే ఉంది.

ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. నాలుగు వారాలపాటు చంద్రబాబుకు బెయిల్ ను మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఆయన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై సోమవారం విచారణ పూర్తి చేసిన హైకోర్టు.. నేడు తీర్పు ఇచ్చింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏసీబీ కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని అనుబంధ పిటిషన్‌ వేశారు. న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పు వెల్లడించారు.

సాయంత్రం విడుదల కానున్న చంద్రబాబు.. 

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో CBNకు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా NOV 24 వరకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా.. సాక్షులను ప్రభావితం చేయకూడదని.. మీడియాతో కేసు అంశాలపై మాట్లాడకూడదని కోర్టు షరతులు విధించింది. చంద్రబాబు వెంట ఇద్దరు డీఎస్పీలను ఉంచుతామని సీఐడీ లాయర్లు కోరగా, పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది. కోర్టు ఆర్డర్లు అందిన తర్వాత సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు.

Exit mobile version