Andhra Pradesh: జనసేనాని పవన్ కళ్యాణ్ కడప జిల్లా పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన పీఎసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ మీడయాతో మాట్లాడుతూ ఏపీ సర్కార్ వైఖరి పై విరుచుకుపడ్డారు. కడపజిల్లాలో ఎవరూ ఊహించని విధంగా కౌలు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పరిపాలన పై అంత భరోసా ఉంటే ఇంత పెద్ద ఎత్తున రైతులు ఎందుకు అత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు.
ఇంతటి బాధ్యతారాహిత్యమైన ప్రభుత్వం మరొకటి లేదన్నారు. త్రిసభ్య కమిటి ఏర్పాటు చేసి చట్టం తెచ్చిన జగన్ ఎంత మందికి 7లక్షల పరిహారం ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. పవన్ కళ్యాణ్ కుటుంబమంతా రైతుల కుటుంబాలకు అర్ధిక సహాయం చేస్తోందన్నారు. కడపలో ఎంత మందికి ఉపాది కల్పించారు. భరోసా ఇచ్చారు. ఉక్కు పరిశ్రమను శంకుస్థాపన చేసి మూడేళ్లైనా కాంపౌండ్ వాల్ కు కూడా నోచుకోలేదని ఎద్దేవా చేసారు. ఉపాది ఉద్యోగ అవకాశాలు లేక వలస బాట పట్టిన యువతకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
మూడేళ్లుగా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా కాగితాలు లేవనే సాకుతో పరిహారం అందించలేదు. ఎంతో మంది కౌలు రైతుల కుటుంబాలు ఇప్పటికీ అధికారుల చుట్టు ప్రదిక్షణలు చేస్తూనే ఉన్నారు కాని స్పందిచన పాపాన పోలేదు. పవన్ చేస్తున్న అర్ధిక సహాయం గురించి జగన్ చులకనగా మాట్లాడారు. మీ స్వంత జిల్లాలోనే పవన్ అర్థిక సహాయం అందచేస్తున్నాం. మీ ప్రతినిధులు వచ్చి చూస్తే పరిస్ధితి అర్థం అవుతుందని అన్నారు. కౌలు రైతులకు అండగా జనసేన పార్టీ ఉంటుందని, వారి పిల్లల చదువులు, బాగోగుల భాద్యత జనసైనికులు తీసుకుంటారని మనోహర్ స్పష్టం చేసారు.