Site icon Prime9

YS Sharmila: వైఎస్ వివేక హత్య మిస్టరీ వీడాలి.. నిందితులకు శిక్ష పడాలి.. షర్మిల

Mystery of YS Viveka's murder must be solved.. Accused must be punished

Mystery of YS Viveka's murder must be solved.. Accused must be punished

Viveka Murder Case: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు మిస్టరీ వీడాలి. దారుణానికి పాల్పొడిన నిందుతులకు శిక్ష పడాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో చోటుచేసుకొన్న కాళేశ్వరం ప్రాజక్టు అవినీతిపై ఫిర్యాదు చేసే క్రమంలో ఆమె ఢిల్లీలో విలేకర్లతో మాట్లాడారు

ఆ సమయంలో ఆమె మాట్లాడుతూ వివేక హత్య కేసు దర్యాప్తును సుప్రీం కోర్టు మరొక రాష్ట్రానికి బదిలీ చేయడాన్ని షర్మిల స్వాగతించారు. హత్యా ఘటన మా కుటుంబంలో చోటుచేసుకొన్న ఓ ఘోరంగా పేర్కొన్నారు. మా చిన్నాన్నను అంత ఘోరంగా ఎవరు హత్య చేశారనేది బయటకు రావాలన్నారు. వాళ్లకు కఠిన శిక్ష పడాలని, కేసు దర్యాప్తును ఎవరూ అడ్డుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వివేక కూతురు సునీతారెడ్డికి న్యాయం జరగాలని ఆశించారు. బాబాయ్ హత్య కేసుకు రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయేమో అన్న అంశాలు సీబీఐ దర్యాప్తులో బయటపడతాయని షర్మిల వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి:AP Police: వైకాపా పై నో యాక్షన్.. జనసేన పై రియాక్షన్.. బయటపడ్డ పోలీసు వైఖరి

Exit mobile version
Skip to toolbar