Site icon Prime9

MP Vijaya Sai Reddy: తండ్రీకొడుకులు ఒకరినొకరు ఓదార్చుకోండి.. విజయసాయిరెడ్డి

Andhra Pradesh: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రముఖ సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆదివారం సమావేశం అయిన విషయం తెలిసిందే. వీరిద్దరి సమావేశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి భేటీ పై రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు పై సెటైర్లు పేల్చారు.

గుండె రాయి చేసుకొని భరించక తప్పదు బాబన్నా. నువ్వేం చూడకూడదు అనుకుంటావో అవే దృశ్యాలు పగబట్టినట్టు తరుముతున్నాయంటూ ఎద్దేవా చేశారు. తండ్రీకొడుకులు ఒకరినొకరు ఓదార్చుకోండి. బయటి వాళ్లు సర్ది చెప్పే విషయం కాదాయె. రేపు కుప్పంలో ఇవే స్లోగన్లు వినిపిస్తాఏమో అంటూ చురకలు అంటించారు.

మరో ట్వీట్ లో వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబుని బిజెపి మళ్లీ చేరదీస్తుందా అన్నది బీజేపీ అంతర్గత విషయం. ఒకటి మాత్రం నిజం. విలువల్లేని టీడీపీతో పొత్తు అనేది బిజెపి స్థాయిని తగ్గిస్తుంది. దరిద్రాన్ని ఎవరైనా కోరి చంకన పెట్టుకుంటారా అంటూ విజయసాయి రెడ్డి రాసారు.

Exit mobile version