Site icon Prime9

MLC Anantha Babu: జైలుకు ఎమ్మెల్సీ అనంత.. కారు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే

MLC Anantha Babu came to jail in MLA's car

MLC Anantha Babu came to jail in MLA's car

Rajamahendravaram: ఆయన ఓ హత్యానేరంలో ముద్దాయి. రిమాండ్ లో ఉన్న ఖైది. కోర్టు ఉత్తర్వులతో జైలు నుండి బయటకు వచ్చిన ఆయన్ను తిరిగి ఓ ఎమ్మెల్యే కారులో దర్జాగా జైలుకు చేరుకొన్నారు. అతగాడే ఎమ్మెల్సీ అనంతబాబు సమాచారం మేరకు.

హత్యా నేరాన్ని ఆత్మహత్యగా నిరూపించే దశలో హత్యగా తేలిన ఘటనలో ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఆయన తల్లి అంత్యక్రియల నేపధ్యంలో 14రోజుల పాటు కోర్టు అనుమతితో అనంతబాబు బెయిల్ పై బయటకు వచ్చారు. తిరిగి శుక్రవారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి చేరుకొనే క్రమంలో ఇంటి నుండి బయలుదేరిన అనంతరం బాబు ఓ ఎమ్మెల్యే కారులో క్వారీ మార్కెట్టు కూడలి వరకు వచ్చారు. అనంతరం అక్కడ నుండి మరో వాహనం ద్వారా కారాగారానికి చేరుకొన్నారు. అదే సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబుకు మద్దతుగా వైసిపి కార్యకర్తలు, క్వారి మార్కెట్టు వరకు దిగబెట్టిన సంబంధిత ఎమ్మెల్యే ఎస్కార్ట్ కూడా ఆయన వెంట ఉండడాన్ని అందరూ చర్చించుకొన్నారు. అధికార మత్తు అంటే ఇది గదా అని చూసిన వారు చర్చించుకోవడం గమనార్హం.

Exit mobile version