Site icon Prime9

Minister Roja : నోటికి హద్దు.. అదుపు లేకుండా వాగుతున్నారని మంత్రి రోజాపై మెగా ఫ్యాన్స్ ఫైర్..

minister roja shocking comments on megastar chiranjeevi

minister roja shocking comments on megastar chiranjeevi

Minister Roja : దేవుడు నోరు ఇచ్చాడు.. అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్యే గా గెలిచారు.. మొత్తానికి ప్రజల టైమ్ బాగోలేక మంత్రి అయ్యారు.. అన్ని అలా జరిగిన ఏ రోజు కూడా తమ శాఖ ఏంటి.. ప్రజలకు, రాష్ట్రానికి ఏ విధంగా మన శాఖ నుంచి మంచి చేయాలి.. రాష్ట్రానికి మన శాఖ పరంగా అభివృద్ధి  ఏ విధంగా తీసుకు రావాలి.. టూరిజంలో ఏపీని మరింతగా ఇంకెలా అభివృద్ది చెందించాలి.. ఒక మంత్రిగా ఇవి చేయాల్సిన వైకాపా మంత్రి రోజా..  దేవుడు నోరు ఇచ్చాడు కదా అని ఇష్టానుసారంగా వాగడం.. సీఎం జగన్ కి భజన చేయడం.. ప్రోగ్రామ్ లలో నృత్యం చేయడం ఇవి మాత్రమే చేస్తున్నారంటూ మెగా ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్లో ఫైర్ అయ్యారు.

సోషల్ మీడియా వేదికగా రోజాని ఏకిపారేస్తున్నారు. గతంలో మెగా బ్రదర్ నాగబాబు అన్న మాటలను గుర్తు చేస్తూ ఆమె నోరు ఒక మురికి కాలువ అన్నట్లు భీభత్సంగా ట్రోల్స్ చేస్తున్నారు.  ఇంతకీ ఈ రేంజ్ లో రోజాపై మెగా ఫ్యాన్స్, జనసేన నేతలు ఫైర్ అవ్వడానికి కారణం ఏంటి అంటే.. తాజాగా మెగాస్టార్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏపీ సర్కారుపై పలు కామెంట్స్ చేశారు. ఇందుకు వైసీపీ నేతలు ఒకరి తర్వాత మరొకరు అదే పనిగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లో మంత్రి రోజా కూడా చేరారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ..

గడప గడపకు చిరంజీవి వచ్చి చూస్తే.. తాము ఏం అభివృద్ధి చేశామో, ఎన్ని రోడ్లు వేశామో తెలుస్తుందని అన్నారు. ఏ అర్హత ఉందని సినిమా టికెట్ ధరలు పెంచమని ప్రభుత్వాన్ని అడుక్కున్నారని ప్రశ్నించారు. హీరోలు అందరూ కలిసి ఎందుకు జగన్ దగ్గరికి వెళ్లారని నిలదీశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మినహాయిస్తే.. ఏ ఇతర హీరోలు ప్రభుత్వాన్ని విమర్శించడం లేదన్నారు. సినిమా వేదికలపై ప్రభుత్వాన్ని తిడితే సహించేది లేదన్న మంత్రి రోజా.. రాజకీయాలు చేయాలని అనుకుంటే, రాజకీయాల్లో ఉండి మాట్లాడాలని ఛాలెంజ్ చేశారు. అలా కాకుండా సినిమాలే చేయాలనుకుంటే, రాజకీయాల జోలికి రాకుండా సినిమాలే చేసుకోవాలని (Minister Roja) హితవు పలికారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఏపీ అభివృద్ధి చేసిన ఘనత జగన్‌ది అని చెప్పుకొచ్చారు.

చిరంజీవి చెబితే విని, పనిచేసే పరిస్థితిలో జగన్ లేరన్నారు. కేంద్రమంత్రిగా చిరంజీవి ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోతుంటే.. చిరంజీవి అప్పుడేం చేశారని అడిగారు. హోదా గురించి అప్పుడు ఎందుకు చిరంజీవి అడగలేదు? అని ప్రశ్నించారు. కేంద్రంమంత్రిగా ఉండి చిరంజీవి ఒక్క ప్రాజెక్టు అయినా కట్టాడా? అని చెప్పారు. ప్రజల తిరస్కారానికి గురైన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసిన చిరంజీవి.. ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని రోజా పేర్కొన్నారు. తమ్ముడి మీద ప్రేమతో చిరంజీవి ఇలా మాట్లాడి, ఏదో బలాన్ని ఇవ్వాలని చూస్తున్నాడని అభిప్రాయపడ్డారు. తమని నమ్మకున్న వాళ్లను రోడ్డుమీదికి వదిలేసి.. వీళ్లు హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నారని కౌంటర్ వేశారు. సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టు.. మళ్లీ అన్నదమ్ములు కలిస్తే అలానే ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

దీంతో ఆమె ఇప్పుడు మెగా ఫ్యాన్స్, జనసేన నేతల ఆగ్రహానికి గురవుతున్నారు. గతంలో తమరి వ్యవహారం ఎంతో అందరికీ తెలుసని.. ఇన్ని కామెంట్స్ చేసే మీరు పోయి చిరుని ఎందుకు కలుస్తున్నారని.. పదవుల కోసం, అవసరాల కోసం రంగులు మార్చే మీలాంటి వారికి ప్రజలే బుద్ధి చెబుతారని మాస్ ర్యాగింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version