Site icon Prime9

Minister Botsa Satyanarayana: 12న విశాఖలో ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయండి.. మంత్రి బొత్స

Make PM Modi's visit to Visakhapatnam on 12th a success

Vizianagaram: ఈ నెల 12న విశాఖకు రానున్న ప్రధానమంత్రి మోది పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి బొత్స సత్యన్నారాయణ వైఎస్ఆర్సీపి శ్రేణులకు పిలుపునిచ్చారు. విజయనగరంలోని సుజాత కన్వెన్షన్ లో జరిగిన వైకాపా నియోజకవర్గం స్థాయి సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని అన్నారు.

ఈనెల 12వ తేదీన 12 వేల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనున్నాయన్నారు. లక్షలాది మందితో మోదీ పర్యటనను విజయవంతం చేయాలని బొత్స విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో జరిగే భారీ బహిరంగ సభకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుందని, ఉదయం 7 గంటల నుంచి పార్టీ శ్రేణులు వారికి కేటాయించిన బస్సులలో బయలుదేరాలన్నారు.

విజయనగరంలో టిడిపి నాయకులు పగటి వేషగాళ్లగా తిరుగుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడే తీరు పై ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి, జిల్లా పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, తదితర కీలక పార్టీ నేతలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Janasena: జగనన్న ఇళ్లు-పేదలందరికీ కన్నీళ్లు.. జగన్ సర్కారు పై జనసేన డిజిటల్ సమరం

Exit mobile version