Weather Update: ఏపీ ప్రజలకు అలర్ట్.. “సిత్రాంగ్ తుఫాను” ముప్పు

ఆంధ్రప్రదేశ్ కు సిత్రాంగ్ ముప్పు పొంచి ఉంది. ఈ తరుణంలో తీరప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Weather Update: ఆంధ్రప్రదేశ్ కు సిత్రాంగ్ ముప్పు పొంచి ఉంది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 24, సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణశాఖ వెల్లడించింది. ఈ తరుణంలో తీరప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 105 మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

తుపాన్ ను ఎదుర్కోనేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ అన్నారు. 24/7 సహాయం కోసం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే దూసుకొస్తున్న సిత్రాంగ్ తుపాన్ వల్ల ఏపీకి పెద్ద ముప్పు ఏమీ లేదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లండింది. అయితే దీని వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఏపీలోని పలు జిల్లాలకు అమరావతి వాతావరణ కేంద్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అక్టోబర్ 25వ తేదీ నాటికి సిత్రాంగ్‌ తుపాను పశ్చిమ బెంగాల్‌ దిశగా ప్రయాణించి దిఘా ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది.

ఇదీ చదవండి: జగన్ సర్కార్ తీపి కబురు.. పోలీస్ శాఖలో 6511 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్