Site icon Prime9

Kodali Nani: ఇంత రచ్చ జరిగినా కొడాలి నాని సైలెంట్.. కారణమేంటి?

Kodali Nani

Kodali Nani

Andhra Pradesh: వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌కు ఏమైంది? కొడాలి నాని ఒక్కసారిగా ఎందుకు సైలెంట్‌ అయ్యారు? జగన్‌ సర్కార్‌ నిర్ణయాల పై కొడాలి నాని అసంతృప్తితో ఉన్నారా? ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టినా, అన్నగారి వీరాభిమాని ఎందుకు స్పందించడం లేదు. లక్ష్మీపార్వతి రియాక్టయినా, కొడాలి నాని మౌనంగానే ఉన్నారు. రీజనేంటి?

వైసీపీ ఫైర్‌బ్రాండ్‌ లీడర్‌, మాజీ మంత్రి కొడాలి నాని ఇప్పుడు ఊహించని మౌనాన్ని పాటిస్తున్నారు. రాజకీయంగా, వైసీపీపైనా, సీఎం జగన్‌పైనా ఎవరు ఏమన్నా, ఆయన విరుచుకుపడతారు. అలాంటి నాయకుడు కీలకటైమ్‌లో సైలెంట్‌ అయిపోయారు. ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైఎస్‌ఆర్‌ పేరు మార్పు తర్వాత, రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. అటు వైపు నుంచి ఎన్టీఆర్ కుటుంబం, ఇటువైపు నుంచి వైసీపీ మంత్రులు, నాయకులు కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి కూడా రియాక్టయ్యారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు చిన్నదన్నట్టుగా చూశారు. మరి ఇంత జరిగినా, కీలకమైన నాయకుడు కొడాలి నాని ఎందుకు మౌనంగా ఉన్నట్టు అనేది ప్రశ్న. అయితే ఆయన మౌనానికి కారణం సీఎం జగన్‌ పై ఆయన ఆవేదన ఉండటమని భావిస్తున్నారు. పేరు మార్పును కొడాలి నాని జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు.

ఎందుకంటే, ఎప్పుడు చంద్రబాబును కౌంటర్ చేయాలన్నా కొడాలి నాని, ‘ఆ మహానుభావుడు రామారావుగారు” అంటూ మొదలు పెట్టి తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారు. అయితే, ఇప్పుడు ఆ పేరును ఎత్తే అవకాశం లేకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది. ఇక ఆ పేరుతో ఆయన చంద్రబాబుకు కౌంటర్ ఇవ్వలేని పరిస్థితి తెచ్చారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ పరిణామాలకు తోడు, తనను మంత్రి వర్గం నుంచి తొలగించారనే ఆవేదన కూడా కొడాలి నానిలో ఉందట. జగన్‌ సర్కారు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల కారణంగానే కమ్మ సామాజిక వర్గంలో తనను దూరంగా పెడుతున్నారని మదన పడుతున్నారని సమాచారం. ఇదే విషయాన్ని ఆయన తరచుగా తన సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తూనే ఉన్నారని తెలిసింది.

వీటికి తోడు, జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజల్లో చులకన అవుతున్నామనే భావన కూడా కొడాలి ఉందని రాజకీయవర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఈ పరిణామాలతోనే, ఆయన తరచుగా పార్టీ కార్యక్రమాలకు కూడా డుమ్మా కొడుతున్నారని తెలుస్తోంది. ఏదేమైనా, లక్ష్మీపార్వతి మాట్లాడిన తర్వాత కూడా కొడాలి నాని నోరు విప్పకపోవడం చర్చనీయాంశం అయ్యింది. ఏదైమైనా అన్నగారికి జరిగిన అవమానం పై ఆయన నోరు విప్పకపోవడం పై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

Exit mobile version
Skip to toolbar