Kodali Nani: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వైఎస్ వివేకానందరెడ్డి బతికున్నా.. కడప ఎంపీ సీటును అవినాష్ రెడ్డికే జగన్ ఇచ్చేవారు.
జగన్ నాశనాన్ని కోరుకున్న వివేకా కుటుంబం(Kodali Nani)
ఎందుకంటే వివేకానంద రెడ్డి కాంగ్రెస్ లో ఉండి .. ఆనాడు వైఎస్ విజయమ్మ నే ఓడించడానికి ప్రయత్నం చేశారు.
జగన్ వినాశానికి వివేకా కుటుంబం ప్రయత్నించింది. వివేకా వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.. ఆయన చినిపోతే దినం ఖర్చులు, కాఫీ, టీ ఖర్చులు తప్పితే ఏం వస్తుంది.
అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర రెడ్డి వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి జగన్ కు తోడుగా నడిచారు.
వివేకా చనిపోతే ఆయన ఆస్తులు ఎవరికి వెళ్లాయి? జగన్ మెహన్ రెడ్డికి ఏమైనా వచ్చాయా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు వివేకా హత్య జరిగింది.
అపుడు కేసు తారుమారు అవుతుందని.. సీబీఐ విచారణ కోరాం. వైఎస్సార్పీపీ ప్రభుత్వం వచ్చాక మేము విచారణ చేసుకుంటామని.. సీబీఐ వద్దు అన్నాం.
అసలు ఏపీలోకి సీబీఐ రావద్దంటూ జీవో ఇచ్చింది చంద్రబాబే కదా.. అసలు వివేకానంద రెడ్డిని చంపింది చంద్రబాబే అని మా అనుమానం’ అని నాని తీవ్ర ఆరోపణలు చేశారు.
వివేకానంద రెడ్డి హత్యకేసును టీడీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు దేశం పార్టీని స్థాపించిన దివంగత ఎన్టీఆర్ ను మానసిక్షోభకు గురిచేసి చంపిన వారికి.. వివేకా హత్య గురించి మాట్లాడే హక్కులేదన్నారు.
టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకడం లేదు
మరో వైపు రాష్ట్రంలో 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని.. అవన్నీ తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
మూడు పట్టభద్రుల నియోజకవర్గాలు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికలు ఉన్నాయని, వీటిలో కూడా ఎట్టిపరిస్థితుల్లో గెలవాలని సీఎం జగన్ దిశానిర్ధేశం చేశారన్నారు.
సమన్వయ కర్తలు, జిల్లా అధ్యక్షులు దీనిపై దృష్టి పెట్టాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు.
గడప గడపకు వెళ్తున్న నేపథ్యంలో 175 నియోజక వర్గాలు గెలుచుకునేలా ప్రతి ఒక్క ఎమ్మెల్యే పనిచేయాలని జగన్ ఆదేశించారని చెప్పారు.
జగన్ మోహన్ రెడ్డి అంటే ఏంటో 2024 లో తెలుస్తుందని నాని పేర్కొన్నారు.