Site icon Prime9

Jr Ntr : నెల్లూరు టీడీపీలో కలకలం సృష్టిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు.. కొసరోడికి పండగే అంటూ

jr ntr flex in nellore create huge sensation in ap politics

jr ntr flex in nellore create huge sensation in ap politics

Jr Ntr : ఏపీలో రాజకీయాలు ఫుల్ హీట్ లో నడుస్తున్నాయి. కాగా ఇప్పుడు తాజాగా నెల్లూరు టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. లోకేష్‌ను ఎన్టీఆర్‌ రాజకీయ వారసుడిగా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని.. సిసలైన వారసులకే పార్టీ పగ్గాలు అప్పజెప్పాంటూ ఓ వర్గం మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే అడపాదడపా పార్టీ మీటింగ్స్ లో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రస్తావన తీసుకువస్తుంటారు. తాజాగా  ప్రకాశం జిల్లా ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకలం రేపాయి.

నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్.. ‘అసలోడు వచ్చే వరకూ కొసరోడికి పండగే’ అంటూ ప్రధాన కూడలిలో ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు. ఓవైపు లోకేష్ యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లాలో జరుగుతున్న సమయంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలంరేపుతోంది. అంతేకాదు ఆ ఫ్లెక్సీలలో పెద్ద ఎన్టీఆర్‌తో పాటు చంద్రబాబు ఫోటోలు కూడా ఉన్నాయి. ఎవరిని ఉద్దేశించి ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనే చర్చ జరుగుతోంది.. వీటిని ఎవరు ఏర్పాటు చేశారో టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు. మరోవైపు నెల్లూరులో పాదయాత్ర చేస్తున్న లోకేష్‌ మరికొన్ని రోజుల్లో ఒంగోలులో అడుగు పెట్టబోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు లోకేష్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశగా మారింది. ఈ ఫ్లెక్సీ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

ఇక లోకేష్ చేస్తున్న యువగళం పాద‌యాత్ర 157వ రోజు కొండేపి నియోజకవర్గంలో కొనసాగింది. మాలెపాడు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. మాలెపాడులో పాడిరైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నారు లోకేష్. చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు హెరిటేజ్ పెట్టారని.. సీఎం అయ్యాక సంగం, విశాఖ‌, ఒంగోలు, విజ‌య వంటి స‌హ‌కార డెయిరీల‌కి ప్రోత్సాహం అందించారన్నారు లోకేష్. త‌న హెరిటేజ్ డెయిరీకే పాలు పోయాల‌ని రైతుల‌ని ఎప్పుడైనా డిమాండ్ చేశారా అని ప్రశ్నించారు. గుజరాత్‌కి చెందిన అమూల్‌కే పాలు పోయాల‌ని రైతుల్ని జ‌గ‌న్ ఎందుకు బెదిరిస్తున్నారని.. టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక మూసేసిన స‌హ‌కార డెయిరీల‌ని తెరుస్తామని పాడి రైతులకు హామీ ఇచ్చారు.

Exit mobile version