Janasena Party : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈ మేరకు నేడు కూడా పవన్ పర్యటించనున్నారు. తాజాగా పార్టీ అధిష్టానం పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ని ప్రకటించింది. షెడ్యూల్ లో భాగంగా ముందుగా మధ్యాహ్నం 12 గం. లకు కాకినాడకు చెందిన ముస్లిం ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గం. కాకినాడ నుంచి బయలుదేరి యానాంలో రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి ముమ్మిడివరం నియోజకవర్గానికి చేరతారు.
20-06-2023
శ్రీ @PawanKalyan గారి షెడ్యూల్
మధ్యాహ్నం 12 గం.: కాకినాడకు చెందిన ముస్లిం ప్రతినిధులతో సమావేశం.
సాయంత్రం 4 గం.: కాకినాడ నుంచి బయలుదేరుట.
యానాంలో రోడ్ షో. అక్కడి నుంచి ముమ్మిడివరం నియోజకవర్గానికి చేరతారు. pic.twitter.com/12rxOev5VB
— JanaSena Party (@JanaSenaParty) June 20, 2023
కాగా నిన్న ఏటిమొగలో మత్స్యకారులతో పవన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన వారినుద్దేశించి మాట్లాడారు. నేను నిబద్ధతతో రాజకీయ పార్టీని స్థాపించాను.రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ప్రజా సమస్యల కోసం నిలబడే పార్టీ జనసేన.సమాజాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాను. వృత్తిఆధారిత సమాజం మనది.తీర ప్రాంతాల్లో అధికంగా నివసించేది మత్స్యకారులే. ఏదైన హాని జరిగితే మత్స్యకారులంతా నలిగిపోతారని అన్నారు. మత్స్యసంపద కూడా వ్యవసాయంతో సమానమని, జనసేన అధికారంలోకి వస్తే మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. సముద్ర జలాలు కలుషితం కాకుండా కఠినమైన పర్యావరణ చట్టాలు తీసుకొస్తామని తెలిపారు. మత్స్యకారుల పోరాటానికి జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తుందని అన్నారు. 2024లో ఒక్కసారి జనసేనను నమ్మండని కోరారు.
అధికారమే అంతిమలక్ష్యం అనుకుంటే ఇంత కష్టపడక్కర్లేదని తనకున్న కెపాసిటీకి ఏదో పదవి పొందొచ్చని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుత సీఎంలా అద్భుతాలు చేస్తానని చెప్పడం లేదు. బటన్ నొక్కితే డబ్బులు పడతాయని చెప్పనని అన్నారు. జనసేన పార్టీకి ఎంపీలు లేరు. నాకు ఓటు బ్యాంక్ ఉంది కాబట్టే మోదీ నాతో మాట్లాడుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. సరైన వ్యక్తిని మీరు నమ్మడం లేదని వచ్చే ఎన్నికల్లో గెలిపించమని అభ్యర్థిస్తున్నానని అన్నారు. మీరు నాకు ఎంపీలు ఇవ్వండి.. నేను పని చేయిస్తాను అంటూ పవన్ వారికి హామీ ఇచ్చారు. ఏటిమొగను స్మార్ట్‌సిటీగా మారుస్తామని కూడా పవన్ కల్యాణ్ మత్స్యకారులకు భరోసా ఇచ్చారు.