Site icon Prime9

Janasena Formation Day: బీజేపీతో జనసేన పొత్తు.. పవన్ కళ్యాణ్ క్లారిటీ

pawan kalyan going to janasena formation day meet on varahi

pawan kalyan going to janasena formation day meet on varahi

Janasena Formation Day: వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఆ పార్టీకి దూరంగా ఉంటానని పవన్ కళ్యాణ్ అన్నారు.

బీజేపీకి దూరంగా ఉంటాం.. (Janasena Formation Day)

వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. ముస్లీంలు తనకు దూరం అవుతారని కొందరు తనకు చెప్పారని పవన్ అన్నారు. అలా అయితే వారికి ఇష్టం లేకపోతే.. తాను బీజేపీకి దూరంగా ఉంటానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ముస్లిం సమాజం జగన్ ను పూర్తిగా నమ్ముతున్నారు. అలాంటిది జగన్ దిల్లీ వెళ్లి ఏం చేస్తారో నాకు తెలుసు. బీజేపీకి జగన్ ఎలా సపోర్ట్ చేస్తారు?. ముస్లిం సమాజం అలాంటివారిని ఎందుకు ప్రశ్నించదు అని పవన్ అన్నారు. జనసేన గురించి ముస్లింలు కూడా ఆలోచించాలి అని సూచించారు. మతం చాలా సున్నితమైన అంశమని ఈ సందర్భంగా పవన్ తెలిపారు.

కులం కాదు.. గుణం చూసి ఓటేయ్యండి..

రాష్ట్రంలో చదువుకున్న యువత ఓటు విషయంలో ఆలోచించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. వచ్చే ఎన్నికల్లో కులం చూసి కాకుండా గుణం చూసి ఓటు వేయాలని యువతకు పిలుపునిచ్చారు. తనకు అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారని తెలిపారు. ఓటు వేసే సమయంలో మా కులపోడు అని చూడకుండా.. అభివృద్ధి చేసే వారికే ఓటు వేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఓటు క్రీయశీల పాత్ర పోషించనుందని.. ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు.

జనసేన ప్రభుత్వాన్ని స్ధాపిస్తాం

వైసీపీ పాలనకు చరమగీతం పాడి.. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

ఇప్పటి వరకు ఎన్ని మాటలన్న.. ఓర్పుతో సహించామని ఇక అలాంటి వాటిని ఉపేక్షించేది లేదని పవన్ వార్నింగ్ ఇచ్చారు.

తెలంగాణలో 30వేల మంది.. పులివెందుల సహా అన్ని చోట్ల క్రియాశీల కార్యకర్తలు జనసేనకు అండగా ఉన్నారని పవన్ వెల్లడించారు.

ప్రజలకు అండగా ఉండాలంటే.. ధర్మాన్ని కాపాడాలని జనసేన ధర్మాన్ని రక్షిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయ అవినీతిపై ప్రజల్లో తిరుగులేని పోరాటం చేస్తామన్నారు.

అసమానతలు, దోపిడీ విధానాలకు ఎదురు తిరగడానికి, పేద వర్గాలకు అండగా నిలబడడానికి జనసేన అండగా ఉంటుందని సూచించారు.

రెండు చోట్ల ఓడిపోయిన.. పార్టీని నడిపే శక్తిని తనకిచ్చారని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేశారు. ఒక్కడిగా ప్రారంభించిన జనసేన.. లక్షల మంది కార్యకర్తలను సంపాదించుకుందని తెలిపారు.

Exit mobile version