Site icon Prime9

Janasena Formation Day: ధైర్యమే మా కవచం.. దెబ్బ పడే కొద్దీ బలపడుతున్నాం- పవన్

janasena chief pawan kalyan name trending in social media

janasena chief pawan kalyan name trending in social media

Janasena Formation Day: వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పటి వరకు ఓర్పుతో సహించామని.. ఇక ప్రజల అండతో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చుతామని పవన్ కళ్యాణ్ అన్నారు.

జనసేన ప్రభుత్వాన్ని స్ధాపిస్తాం (Janasena Formation Day)

వైసీపీ పాలనకు చరమగీతం పాడి.. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పటి వరకు ఎన్ని మాటలన్న.. ఓర్పుతో సహించామని ఇక అలాంటి వాటిని ఉపేక్షించేది లేదని పవన్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో 30వేల మంది.. పులివెందుల సహా అన్ని చోట్ల క్రియాశీల కార్యకర్తలు జనసేనకు అండగా ఉన్నారని పవన్ వెల్లడించారు. ప్రజలకు అండగా ఉండాలంటే.. ధర్మాన్ని కాపాడాలని జనసేన ధర్మాన్ని రక్షిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయ అవినీతిపై ప్రజల్లో తిరుగులేని పోరాటం చేస్తామన్నారు. అసమానతలు, దోపిడీ విధానాలకు ఎదురు తిరగడానికి, పేద వర్గాలకు అండగా నిలబడడానికి జనసేన అండగా ఉంటుందని సూచించారు. రెండు చోట్ల ఓడిపోయిన.. పార్టీని నడిపే శక్తిని తనకిచ్చారని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేశారు. ఒక్కడిగా ప్రారంభించిన జనసేన.. లక్షల మంది కార్యకర్తలను సంపాదించుకుందని తెలిపారు.

పదేళ్ల ప్రస్థానంలో ఎన్నో చూశాం..

జనసేన ఆవిర్భాంచి పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామని అన్నారు.

జనసేన పార్టీ పెట్టినప్పుడు తనతో కొద్దిమంది మాత్రమే ఉన్నారని.. ఆ సమయంలో రాజకీయాలు ఎలా చేయాలో తనకు తెలియదన్నారు.

చిన్నప్పటి నుంచి సమాజ శ్రేయస్సు గురించి ఆలోచనతోనే ప్రజల్లోకి వచ్చినట్లు తెలిపారు. అభిమానులు ఇచ్చిన ధైర్యం.. సమాజంలో జరుగుతున్న చెడును చూసే పార్టీని స్థాపించినట్లు తెలిపారు. ఈ పార్టీ ఏర్పాటుకు స్వాతంత్ర్య సమరయోధులను స్పూర్తిగా తీసుకున్నట్లు ఆయన అన్నారు. సగటు మనిషికి న్యాయం చేయాలన్నదే తల తపన అని సభావేదికగా తెలిపారు.

ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలి..

రాష్ట్రంలో ప్రజలు అధికార మార్పుని కోరుకుంటున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లిన ఇదే విషయం వినిపిస్తోందని ఆయన అన్నారు.

కొన్ని కులాల అనైక్యత వల్ల.. దేహి అనే పరిస్థితి ఏర్పడిందని పవన్ అన్నారు. కులాలు ఐక్యంగా ఉన్నప్పుడే.. ఆర్థిక స్వాతంత్ర్యం వస్తుందని సూచించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం కులాలను విడదీసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరారు. అగ్రకులాల్లో ఉన్న పేదలకు జనసేన అండగా ఉంటుందని ఈసందర్భంగా పవన్ తెలిపారు.

Exit mobile version