Site icon Prime9

Pawan Kalyan : వారాహి యాత్రలో భాగంగా నేడు మలికిపురంలో జనసేన భారీ బహిరంగ సభ..

janasena chief Pawan Kalyan varahi yatra today schedule

janasena chief Pawan Kalyan varahi yatra today schedule

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అశేష జనవాహిని మధ్య దిగ్విజయంగా సాగుతుంది. ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుండగా.. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. అకాల వర్షం కారణంగా 24 వ తేదీన జరగాల్సిన బహిరంగ సభను వాయిదా వేశారు. ఈ క్రమంలో నేడు తాజాగా పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ముందుగా 11 గంటల నుంచి దిండి రిసార్ట్స్‌లో పి.గన్నవరం నియోజకవర్గ పార్టీ నేతలతో పాటు, పలు జనసేన శ్రేణులతో సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు సాయంత్రం మలికిపురం వారాహి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే జనసేన నేతలు, శ్రేణులు ఏర్పాట్లు చేశారు. ఉదయం రాజోలు నియోజకవర్గ నాయకులు, ప్రతినిధులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం నుంచి రోడ్ షో నిర్వహిస్తూ పవన్ మలికిపురం సెంటర్ లో నిర్వహించనున్న బహిరంగ సభకు చేరుకొని అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

 

Exit mobile version