Site icon Prime9

Varahi Yatra : నాలుగో విడత వారాహి యాత్ర‌కు సిద్దమైన జనసేనాని పవన్ కళ్యాణ్.. ఎక్కడి నుంచి అంటే ??

janasena chief pawan kalyan varahi yatra details

janasena chief pawan kalyan varahi yatra details

Varahi Yatra : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్రకు రెడీ అయ్యారు. అయితే టీడీపీ, జనసేనల పొత్తు ప్రకటన తర్వాత పవన్ జనాల్లోకి వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో ఈసారి పవన్ వారాహి యాత్రపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మూడు విడతలు పూర్తి కాగా ప్రజలు ఈ యాత్రకు బ్రహ్మరధం పడుతున్నారు.. భారీ స్థాయిలో ప్రజలు, జనసేన నేతలు, జనసైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొంటూ దిగ్విజయంగా యాత్ర సాగేలా చేస్తున్నారు. అయితే ఇప్పుడు చేపట్టే నాలుగో విడత యాత్రలో తెదేపా శ్రేణులు కూడా యాత్రలో పాల్గొంటారని సమాచారం అందుతుంది.

ఇక నాలుగో విడత వారాహి విజయ యాత్రను అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ తాజాగా సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ ప్రకటించింది. కృష్ణా జిల్లాలో ఈ యాత్ర సాగనుండగా.. అక్టోబర్ 1వ తేదీ నుంచి అవనిగడ్డలో నాలుగో విడత వారాహి విజయ యాత్రను పవన్ ప్రారంభించనున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మొదలయ్యే ఈ యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా జరగనుంది. ఈ యాత్రకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను తదుపరి సమావేశంలో ఖరారు చేయనున్నారు. మరి ఈ యాత్రలో భాగంగా పవన్ జనసేన పోటీ చేసే స్థానాలపై క్లారిటీ ఇస్తారా? పవన్ యాత్రకు పోలీసుల అనుమతి ఉంటుందా? మళ్ళీ ఆంక్షలు విధిస్తారా? అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి.

Exit mobile version