Pawan Kalyan : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం రాజకీయ కక్ష సాధింపే అని జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని పవన్ ప్రశ్నించారు. చంద్రబాబుకు నా సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని.. ఇది కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యేనన్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నామని.. ప్రాథమిక ఆధారాలు చూపకుండా అర్ధరాత్రి అరెస్ట్ సరికాదని మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉండటం వల్లే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు. గతంలో కూడా ఏ తప్పూ చేయని జనసేన నాయకులపైనా హత్యాయత్నం కేసులు పెట్టారన్నారు.
Pawan Kalyan : చంద్రబాబు అరెస్ట్ కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యే – జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్

janasena chief pawan kalyan responce on chandrababu naidu arrest