Site icon Prime9

Pawan Kalyan : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్న పవన్ కళ్యాణ్..

janasena chief pawan kalyan pay tributes to gandhi jayanthi

janasena chief pawan kalyan pay tributes to gandhi jayanthi

Pawan Kalyan : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. నేడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నారు. ఈ మేరకు వారాహి యాత్ర నాలుగో దశలో భాగంగా ఈరోజు మచిలీపట్నంలోపర్యటించనున్నారు. అందులో భాగంగానే మచిలీపట్నంలో ముందుగా మహాత్మా గాంధీకి పవన్ నివాళులర్పిస్తున్నారు. ఆ తర్వాత వారాహి యాత్రలో భాగంగా.. కృష్ణాజిల్లా కార్యవర్గంతో సమావేశం కానున్నారు.

కాగా, వారాహి యాత్ర నాలుగో దశ మొదటి రోజు అవనిగడ్డలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన నేతలతో పాటు టీడీపీ శ్రేణులు సైతం భారీ స్థాయిలో పాల్గొన్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలో భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తు దృష్ట్యా ఈసారి ఓటు చీలనివ్వకూడదు.. వైసీపీ ప్రభుత్వాన్ని దించేయడమే మా లక్ష్యం అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి జనసేన-టీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు.

 

Exit mobile version