Site icon Prime9

Jogi Ramesh : వైకాపా మంత్రి జోగి రమేశ్ కి చుక్కలు చూపించిన జన సైనికులు, వీర మహిళలు.. హై టెన్షన్ !

janasena activists fires on ycp minister jogi ramesh

janasena activists fires on ycp minister jogi ramesh

Jogi Ramesh : వైకాపా మంత్రి జోగి రమేశ్ కి జనసేన నేతలు చుక్కలు చూపించారు. ఇటీవల జనసేన అధినేత పవన్ పై మంత్రి జోగి రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మార్చడం, తార్చడం వంటివి పవన్ కు అలవాటేనని ఆయన అన్నారు. పెళ్లాలనే కాకుండా పార్టీలను కూడా మారుస్తుంటారని విమర్శించారు. కాగా ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ జనసేన శ్రేణులు, జనసేన వీర మహిళలు జోగి రమేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పిచ్చికుక్క జోగి రమేశ్ అంటూ ఆయన దిష్టిబొమ్మను వీరమహిళలు చెప్పుతో కొట్టారు. దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

 

Exit mobile version