Site icon Prime9

Janasena Activists: మంత్రి రోజా తీరును తప్పుబడుతున్న జనసేన కార్యకర్తలు

Jana Sena activists are criticizing the behavior of Minister Roja

Jana Sena activists are criticizing the behavior of Minister Roja

Minister Roja: జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ పర్యటనలో మంత్రి రోజా ప్రవర్తించిన తీరును జనసేన సైనికులు తప్పుబడుతున్నారు. రాజకీయ దురుద్ధేశంలో భాగంగానే విశాఖ విమానాశ్రయ ఘటనగా వారు పేర్కొంటున్నారు.

ప్రజా సమస్యలపై చేపట్టిన జనవాణి కార్యక్రమం విజయవంతం కాకుండా ఉండేలా కవ్వింపు చర్యలతో మంత్రి రోజు వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. రాళ్ల దాడి ప్రారంభం కావడం కూడ పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. పదే పదే వ్యక్తిగత అంశాలను ప్రస్తావించిన రోజా ప్రజాస్వామ్య పద్దతిలో చేపడుతున్న ర్యాలీలు, సభలను అడ్డుకొనే ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.

ఈ రోజు మంత్రి రోజు అండ్ టీం చేసిన పనికి దూర ప్రాంతాల నుండి వచ్చిన సామాన్యుల సమస్యల వేదన వ్యర్ధమైందన్నారు. అసెంబ్లీ చెప్పుకొనే పరిస్ధితి లేని సమయంలో అభాగ్యులు, నిస్సహాయల సమస్యలు ఎలా తెలుసుకొంటారో చెప్పాలని వారు నిలదీశారు. విద్యార్ధులను రెచ్చగొట్టడం రోజాకే చెల్లిందన్నారు. ఇదంతా పొలిటికల్ డ్రామాగా పేర్కొన్నారు. యువశక్తిని అడ్డుకోవాలంటే మీరే బలౌతారని గుర్తుపెట్టుకోవాలని రోజాకు హితవు పలికారు.

పదే పదే పవన్ కల్యాణ్ మూడు పెళ్లిల్లు గురించి మాట్లాడుతున్న రోజా సీఎం జగన్ తల్లి, చెల్లిని ఎందుకు వదిలేశారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికొండను బోడిగుండును చేసిన ఘనత వైకాపాదని వ్యాఖ్యానించారు. స్టీలు ప్లాంట్ ప్రైవేటీ కరణపై చేయాల్సిన రాజీనామాలను మూడు రాజధానుల పేరుతో డ్రామాలు ఆడడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎన్ని ఐటి కంపెనీ తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు.

పవన్ కల్యాణ్ ను తిడితే రోజాకు సీఎం జగన్ ప్యాకెజ్ ఇస్తున్నాడు కాబట్టే ఆమె పదే పదే మీడియా ముందకు వచ్చి మొరుగుతున్నారన్నారు. మంత్రి పదవికి రాజీనామ చేసి జబర్ధస్ట్ చేసుకోవాలని ఎద్దేవా చేశారు. మీకు సంస్కారం జగన్ నేర్పలేదు, కాని పవన్ కల్యాణ్ మాకు సంస్కారం నేర్పించారని జనసేన మహిళా సైనికులు రోజాకు బుద్ధి చెప్పారు. చివరగా వైఎస్ షర్మిలకు ఎంతమంది మొగుళ్లు చెప్పండి అంటూ ఎదురు ప్రశ్న వేసి జగన్ ను ఇరకాటంలోకి నెట్టారు.

ఇది కూడా చదవండి: Janasena Party: ఉత్తరాంధ్ర మంత్రులకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన జనసేన పార్టీ

Exit mobile version