Janasena: జగనన్న ఇళ్లు-పేదలందరికీ కన్నీళ్లు.. జగన్ సర్కారు పై జనసేన డిజిటల్ సమరం

జనసేన మరోసారి జగన్ సర్కార్‌పై డిజిటల్ సమరం ప్రారంభించింది. ఈ నెల 12,13,14 తేదీల్లో జగనన్న కాలనీ ఇళ్లు, టిడ్కో ఇళ్ల పై జనసేన సోషల్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించింది.

  • Written By:
  • Publish Date - November 9, 2022 / 08:25 PM IST

Janasena Digital Politics: జనసేన మరోసారి జగన్ సర్కార్‌ పై డిజిటల్ సమరం ప్రారంభించింది. ఈ నెల 12,13,14 తేదీల్లో జగనన్న కాలనీ ఇళ్లు, టిడ్కో ఇళ్ల పై జనసేన సోషల్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించింది. జగనన్న ఇళ్ళ పేరుతో అదికార పార్టికి చెందిన నాయకులు కోట్ల రూపాయలు దోచుకున్నారని, సోషల్ మీడియా వేదికగా జగనన్న కాలనీల్లో అవినీతి పై పోరాటం చేయాలని ఆ పార్టీ నేతల నాదెండ్ల మనోహర్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల పేరుతో చేపడుతున్న జగనన్న కాలనీలు అతి పెద్ద స్కాం అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. భూమి కొనుగోలు, మౌలిక వసతులు పేరిట వేల కోట్లు అవినీతి చేశారని ఆయన ఆరోపించారు.

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 12, 13, 14 తేదీల్లో ‘జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తీసిన ఫోటోలు, వీడియోలను #Jagananna Mosam హ్యాష్ ట్యాగ్ ద్వారా సోషల్ మీడియాలో పోస్టు చేసి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రంలో ఒక చోట అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగనన్న కాలనీలను పరిశీలిస్తారని తెలిపారు.

తొలి విడతలో 18,63,552 గృహాలు 2022 జూన్ నాటికి నిర్మించి పేదలకు అందిస్తామని చెప్పారని అన్నారు. అయితే చెప్పిన గడువు ముగిసి ఐదు నెలలయినా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇచ్చిన దాఖలాలు లేవని మనోహర్ విమర్శించారు.