Site icon Prime9

Devineni Uma: జగన్ రైతు ద్రోహి, 42నెలలుగా పోలవరాన్ని పండబెట్టారు.. మాజీ మంత్రి దేవినేని ఉమా

Jagan is a traitor to the farmer

Devineni Uma: విభజన తెలుగు రాష్ట్రాల్లో పోలవరం ప్రాజక్ట్ ఏపీకి ఓ పెద్ద వరం. దీన్ని గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 71శాతం పనులు పూర్తి చేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపి ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని పెట్టించుకోకపోవడంతో ఎక్కడ వేసినా గొంగళి అక్కడే ఉండిపోయింది. పోలవరాన్ని పరిగెత్తిస్తామని తొడలు కొట్టిన నాటి వైకాపా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాటలు నీటిమూటలగానే మిగిలిపోయాయి. అనంతరం ఆయన స్థానంలో వచ్చిన మంత్రి అంబటి సైతం పోలవరం నిర్మాణంపై ఓ క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఈ క్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విటర్ వేదికగా జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.

42 నెలలుగా పోలవరాన్ని పడుకోబెట్టారని మండిపడ్డారు. 71శాతానికిపైగా పోలవరం పనులు పూర్తిచేసిన ఘనత చంద్రబాబుదే అని అన్నారు. జరుగుతున్న పనులను కమీషన్ల కక్కుర్తితో వైసీపీ ఆపేసిందని ఆరోపించారు. నిపుణులు హెచ్చరించినా వినకుండా తప్పిదాలు చేశారన్నారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమంటున్న జగన్‌రెడ్డి రైతుద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: Senior IAS Y Srilakshmi: ఓఎంసీ మైనింగ్ కేసు.. ఏపీ ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి భారీ ఊరట

Exit mobile version