Site icon Prime9

Kodali Nani: బాలకృష్ణకు సిగ్గుందా? కొడాలి నాని

kodali-nani falls ill and-admitted-in-apollo-hospital hyderabad

kodali-nani falls ill and-admitted-in-apollo-hospital hyderabad

Andhra Pradesh: తండ్రిని చంపిన చంద్రబాబుతో షోలు చేస్తున్న బాలకృష్ణకు సిగ్గుందా? అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. నాని బుధవారం గుడివాడ ఐదో వార్డు శ్రీరామపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులతో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ మరణించి 25 ఏళ్లు గడిచినా, ఇప్పటికీ చంద్రబాబు షోల పేరుతో ఆయనపై అసత్య ప్రచారాలు చేస్తూ క్షోభ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఎన్టీఆర్ కాళ్ల దగ్గరే ఉండి ఆయనకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు ప్రజల కళ్లు కప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌కు పార్టీ నడపడం చేతకాకపోతే, చంద్రబాబు బయటకు పోవాలని, కానీ ఆయన పార్టీ లాక్కోవడమేంటని అన్నారు. ఎన్టీఆర్‌ను మించి ఆయన కొడుకు బాలకృష్ణ నటిస్తున్నారని, చంద్రబాబుతో కలిసి షోలు చేస్తున్నారని నాని విమర్శించారు. పవన్‌ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని అని చంద్రబాబు చెప్పినట్లు ఆడుతున్నారని ఆరోపించారు. నారా లోకేష్‌కు పార్టీని పూర్తిగా అప్పచెప్పాలన్నదే చంద్రబాబు నాయుడు లక్ష్యమని కానీ ఆ పార్టీ అభిమానులు, చాలామంది నేతలు మాత్రం, అందుకు సిద్ధంగా లేరని, వారంతా జూనియర్ ఎన్టీఆర్ పగ్గాలు చేపట్టాలని కోరుకుంటున్నారని, అందుకే ఆ కోపంతోనే చంద్రబాబు నాయుడే, అమరావతి రైతుల పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్‌ను తిట్టిస్తున్నారన్నారని అన్నారు.

కొందరు అమరావతి రైతులు, టీడీపీ, జనసేన, తోక పార్టీలు చేస్తున్న పాదయాత్రకు విరుగుడే విశాఖలో జేఏసీ సభ అని అన్నారు. విశాఖ గర్జన బల ప్రదర్శన కాదని, మూడు జిల్లాల ప్రజల ఆకాంక్ష నాని అన్నారు.

Exit mobile version