Site icon Prime9

Minister Roja: వైసీపీ ప్రభుత్వం అభివృద్ది పై చర్చకు నేను రెడీ.. మీరు రెడీనా.. మంత్రి రోజా సవాల్

Minister Roja

Minister Roja

Andhra Pradesh: మూడున్నర సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చర్చకు మీరు సిద్ధమా అంటూ మంత్రి రోజా ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. శనివారం శ్రీవారి కల్యాణోత్సవ సేవలో పాల్గొన్న మంత్రి రోజా ఆలయం వద్ద మీడియాతో మాట్లాడారు.

ఇప్పటం ఆక్రమణల పై ప్రజలకు ఆరు నెలల ముందే అధికారులు నోటీసులు జారీ చేశారన్నారు. ఏం ఉద్దరించడానికి ఇప్పుడు పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామానికి వెళ్తున్నారని రోజా ప్రశ్నించారు. కళ్లు ఉన్న కబోది చంద్రబాబు అని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ నడుస్తున్నారని, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకుంటున్నారన్నారు. ఇప్పటం గ్రామంలో రోడ్లు వేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి పవన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ప్రజల గుండెల్లో స్థానం లేని పవన్ కల్యాణ్, చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు. పవన్, చంద్రబాబు ముసుగు తొలగిపోయింది. ఇద్దరు ప్లాన్ చేసుకుని డ్రామాలు ఆడుతున్నారని రోజా ఆరోపించారు.

Exit mobile version