Site icon Prime9

ఆంధ్రప్రదేశ్: 2023 క్యాలెండర్ విడుదల.. వచ్చే ఏడాది ఏపీ ప్రభుత్వం సెలవులు ఎన్నో తెలుసా..?

how-many-govt-holidays-in-ap-government-2023-calender

how-many-govt-holidays-in-ap-government-2023-calender

Andhra Pradesh: 2022 సంవత్సరం చివరికి వచ్చేసాం. ఇంకో కొద్దిరోజుల్లో డిసెంబర్ నెల ముగిసి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. మరి కొత్త సంవత్సరంలో ఏ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయి.. ఏ పండుగలు ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందాం.

2023 ఏడాదికి గానూ సెలవుల క్యాలెండర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారంగా ప్రభుత్వ కార్యాలయాలకు 23 సాధారణ సెలవులు, 22 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. సాధారణ సెలవుల్లో మూడు ఆదివారాలు, ఒకటి రెండో శనివారం.. ఐచ్ఛిక సెలవుల్లో నాలుగు ఆదివారాలు ఉన్నాయి. ఇకపోతే తెలుగు ప్రజల పెద్ద పండుగలు అయిన మకర సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి శుభ దినాలు కూడా ఆదివారాల్లో మరియు సాధారణ సెలవుల్లో వచ్చాయి. ఒకవేళ మరో రోజు అదనంగా సెలవు కావాలంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతాధికారుల అనుమతితో ఐదు ఐచ్ఛిక సెలవులను పొందేందుకు ఏపీ ప్రభుత్వం వీలు కల్పించింది.

రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీ వంటి పండుగలతోపాటు తిథులను బట్టి వచ్చే హిందూ పండుగల్లో మార్పులు ఉంటాయని, వాటిని ఆయా సమయాలను బట్టి ముందుగానే పత్రికా ప్రకటన, మీడియా ద్వారా తెలియజేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే తెలుగువారి కొత్త సంవత్సరాది అయిన ఉగాది మరియు శ్రీరామ నవమి, వినాయక చవితి వంటి పండుగ రోజుల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని ప్రభుత్వం తన ప్రకటన ద్వారా తెలిపింది.

దీనితో బ్యాంకర్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ అంశంపై యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
తమకు పండుగ రోజుల్లో సెలవు ప్రకటించకపోవంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమైన హిందూ పండుగలకు బ్యాంకు ఉద్యోగులకు సెలవులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం గత మూడేళ్లుగా తమపట్ల ఇలాగే వ్యవహరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే ఈ మూడు పండుగలకు కూడా సెలవులు ప్రకటించాలని బ్యాంక్ యూనియన్ డిమాండ్ చేసింది.

ఇదీ చదవండి: పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుండేదని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు… స్వార్థం కోసం ప్రభుత్వం ఇచ్చే పథకాలపై ఆధారపడొద్దు

Exit mobile version