Nandyal Murder: ఆంధ్రప్రదేశ్ లో పరువు హత్య కలకలం రేపింది. కన్న కూతురినే తండ్రి దారుణంగా హత్య చేశాడు. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూతురు గొంతు కోసి.. దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కూతురి గొంతు కోసిన తండ్రి.. (Nandyal Murder)
కూతురు పట్టిందని ఆ తండ్రి సంతోషించాడు. కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. కూతురిని బాగా చదివించాలనుకున్నాడు. కానీ తన కూతురు వేరే కులం వ్యక్తితో ప్రేమలో ఉందని తెలుసుకున్నాడు. సమయం వృదా చేయకుండా.. సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఇచ్చి ప్రసన్నకు ఘనంగా పెళ్లి చేశాడు. గారబంగా పెంచుకున్న తన కూతురిని.. అత్తవారింటికి పంపించి తన బాధ్యతలు పూర్తి చేసుకున్నాడు. ఇక భర్తతో చక్కగా కాపురం చేసుకోవాల్సిన ఆ యువతి.. మళ్లీ తప్పటడుగులు వేసింది. పెళ్లయిన కూడా.. ప్రియుడికి మళ్లీ దగ్గరైంది. ప్రియుడిపై మోజుతో.. భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చేసింది. తమ కుమార్తె భర్తను వదిలేసి పుట్టింటికి రావడంతో ఆ తండ్రి బాధతో తల్లడిల్లిపోయాడు. కూతురు చేసిన పనికి.. పరువు పోయిందని భావించాడు. కూతురు కన్న పరువే ముఖ్యం అని భావించాడు. కూతురిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి.. హత్య చేశాడు. తల, మొండెం వేరు చేసి విసిరేశాడు. ఇంతా చేసిన.. ఏం తెలియనట్లు గడిపాడు. అమ్మాయి కనబడటంలేదని.. వారి తాత నిలదీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పెళ్లయినా ప్రియుడితో సంబంధం..
పాణ్యం మండలం ఆలమూరుకు చెందిన దేవంద్రరెడ్డికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ప్రసన్నకు రెండేళ్ల కిందట వివాహం చేశారు. కూతురు, అల్లుడు హైదరాబాద్ లో ఉంటున్నారు. పెళ్లికి ముందే ప్రసన్న మరో వ్యక్తిని ప్రేమించేది. ఇది గమనించిన తండ్రి వెంటనే వివాహం జరిపించాడు. పెళ్లైన కూడా ప్రియుడితో స్వప్న సంబంధం పెట్టుకుంది. భర్తను వదిలేసి.. పుట్టింటి వద్దే ఉంటోంది. తిరిగి భర్త వద్దకు వెళ్లాలని తండ్రి పలుమార్లు సూచించాడు. ఎంత సర్ధిచెప్పిన వినకపోవడంతో కుమార్తెపై కోపం పెంచుకున్నాడు. కూతురు చేసిన పనితో పరువు పోయిందని భావించాడు. దీంతో కూతురిని హత్య చేశాడు. పెళ్లి తర్వాత.. అన్ని మర్చిపోయి కూతురు సంతోషంగా ఉంటుందని తండ్రి అనుకున్నాడు. ఈ బాధను తట్టుకోలేక హత్య చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.