Vizianagaram Train Accident : విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్లు రద్దు,, హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు ..

విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. విశాఖ నంచి పలాస వెళ్తున్న ప్యాసింజర్ రైలు (08532) సిగ్నల్ కోసం కొత్తవలస మండలం అలమండ, కంటకాపల్లి వద్ద పట్టాలపై ఆగి ఉంది. అదే లైనులో వెనుకే వచ్చిన విశాఖ- రాయగడ రైలు (08504).. పలాస వెళ్తున్న రైలును ఢీకొట్టింది.

  • Written By:
  • Updated On - October 30, 2023 / 01:17 PM IST

Vizianagaram Train Accident :  విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. విశాఖ నంచి పలాస వెళ్తున్న ప్యాసింజర్ రైలు (08532) సిగ్నల్ కోసం కొత్తవలస మండలం అలమండ, కంటకాపల్లి వద్ద పట్టాలపై ఆగి ఉంది. అదే లైనులో వెనుకే వచ్చిన విశాఖ- రాయగడ రైలు (08504).. పలాస వెళ్తున్న రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 14 కి చెరినట్లు తెలుస్తుంది. మరో 33 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. క్షతగాత్రులను విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని పలు హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 30 నుండి 40 వరకు వుండే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

రద్దయిన రైళ్ల వివరాలు..

ఈ క్రమంలోనే సోమవారం పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రద్దయిన రైళ్లలో రత్నాచల్‌, సింహాద్రి, ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-పూరీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కూడా ఉన్నాయి.

(12718) విజయవాడ-విశాఖపట్నం రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌

(12717) విశాఖపట్నం-విజయవాడ రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌

17239- గుంటూరు-విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌

17267 కాకినాడ-విశాఖపట్నం మెమూ ఎక్స్‌ప్రెస్‌

17268 విశాఖపట్నం-కాకినాడ మెమూ ఎక్స్‌ప్రెస్‌

07466 రాజమండ్రి-విశాఖపట్నం మెమూ స్పెషల్‌

07466 విశాఖపట్నం-రాజమండ్రి మెమూ స్పెషల్‌

17243 గుంటూరు- రాయగడ ఎక్స్‌ప్రెస్‌

08545 కోరాపుట్‌-విశాఖపట్నం స్పెషల్‌

08546 విశాఖపట్నం- కోరాపుట్‌ స్పెషల్‌

22860 ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- పూరీ ఎక్స్‌ప్రెస్‌

17244 రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌

17240 విశాఖపట్నం- గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ (ఇవాళ, రేపు రద్దు)

దారి మళ్లించిన రైళ్ల వివరాలు..

ధన్‌బాద్‌ నుంచి 29న బయల్దేరాల్సిన ధన్‌బాద్‌ – అలెప్పీ బొకారో ఎక్స్‌ప్రెస్‌ను(13351 ) ఝార్సుగూడ, రాయ్‌పుర్‌, నాగ్‌పుర్‌, కాజీపేట, విజయవాడ మీదుగా దారి మళ్లించారు.

హతియా నుంచి 29న బయల్దేరాల్సిన హతియా – ఎస్‌ఎంవీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ను(12835 ) ఝార్సుగూడ, రాయ్‌పుర్‌, నాగ్‌పుర్‌, కాజీపేట, విజయవాడ మీదుగా దారి మళ్లించారు.

విజయవాడ – నాగ్‌పుర్‌ – రాయ్‌పుర్‌ – ఝార్సుగూడ – ఖరగ్‌పూర్‌ మీదుగా..

రైళ్ల వేళల్లో మార్పులు..

హవ్‌డా నుంచి 29న 22.55 గంటలకు బయల్దేరాల్సిన హవ్‌డా – శ్రీ ఎమ్‌. విశ్వేశ్వరయ్యా టెర్మినల్‌(బెంగళూరు) ఎక్స్‌ప్రెస్‌ను(12863) 30వ తేదీ 00.55 గంటలకు మార్చారు.

హవ్‌డా నుంచి 29న 23.25 గంటలకు బయల్దేరాల్సిన హవ్‌డా – పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌ను(12867) 30వ తేదీ 01.25 గంటలకు రీషెడ్యూల్‌ చేశారు.

హవ్‌డా నుంచి 29న 23.55 గంటలకు బయల్దేరాల్సిన హవ్‌డా – ఎంజీఆర్‌ చెన్నై మెయిల్‌ను(12839) 30వ తేదీ 01.55 గంటలకు రీషెడ్యూల్‌ చేశారు.

షాలిమార్‌ నుంచి 29న 01.50 గంటలకు బయల్దేరాల్సిన షాలిమార్‌ – తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్‌ను(22642) 30వ తేదీ 01.50 గంటలకు మార్చారు.

ఎంజీఆర్‌ చెన్నై నుంచి 30న 07.00 గంటలకు బయల్దేరాల్సిన ఎంజీఆర్‌ చెన్నై – షాలిమార్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ను(12842) 30వ తేదీ 09.30 గంటలకు రీషెడ్యూల్‌ చేశారు.

అలప్పుజా నుంచి 30న 06.00 గంటలకు బయల్దేరాల్సిన అలప్పుజా – ధన్‌బాద్‌ బోకారో ఎక్స్‌ప్రెస్‌ను(13352) 30వ తేదీ 09.00 గంటలకు రీషెడ్యూల్‌ చేశారు.

విజయనగరం సమీపంలో జరిగిన రైలుప్రమాద బాధితుల సహాయం కోసం, సమాచారం అందించేందుకు రైల్వే, విశాఖ జిల్లా అధికారులు సహాయక కేంద్రాలను (కంట్రోల్‌ రూం) ఏర్పాటు చేశారు.

విశాఖ కేజీహెచ్‌లో, విమ్స్‌లో వైద్యబృందాలను కలెక్టర్‌ మల్లికార్జున అందుబాటులో ఉంచారు. అలాగే బాధితులకు వైద్య సహాయార్థం హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటుచేశారు.

TRAIN

హెల్ప్‌లైన్‌ నంబర్లు..

విజయనగరం కలెక్టరేట్‌: 94935 89157

విశాఖ కలెక్టరేట్‌: 90302 26621, 70361 11169, 08912 590102

కేజీహెచ్‌: 89125 58494, 83414 83151

వైద్యుడు (24 గంటలు అందుబాటులో ఉంటారు): 83414 83151

అత్యవసర విభాగం వైద్యుడు: 86883 21986

రైల్వే ఆధ్వర్యంలో..

భువనేశ్వర్‌: 06742301625, 06742301525, 06742303060, 06742303729 (టోల్‌ ఫ్రీ)

వాల్తేరు టెస్ట్‌ రూం: 89780 80805

సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ : 89780 80815

వాల్తేరు డివిజన్‌: 08942286245, 08942286213

అలమండ, కంటకాపల్లి: 89780 81960

విజయనగరం: 08922221206, 08922221202, 89780 80006

శ్రీకాకుళం రోడ్డు: 08942286213, 08922286245

ఏలూరు: 08812232267

సామర్లకోట: 08842327010

రాజమహేంద్రవరం: 08832420541

తుని: 08854252172

విశాఖ రైల్వేస్టేషన్‌లో..: 08912 746330; 08912 744619; 81060 53051; 81060 53052; 85000 41670; 85000 41671.