Site icon Prime9

Amaravati Farmers Padayatra: పాదయాత్ర పిటిషన్ల విచారణ పూర్తి.. తీర్పు రిజర్వ్

Hearing of padayatra petitions complete...Judgment reserved

Amaravati: రైతుల తలపెట్టిన పాదయాత్ర పై ఇటు ప్రభుత్వం, అటు రైతుల పిటిషన్ల పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ధర్మాసనం తీర్పును రిజర్వులో పెట్టింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని న్యాయవాదులు కోరారు.

పేర్కొన్న మేర 600 మంది మాత్రమే పాదయాత్రలో రైతులు పాల్గొంటారని, సంఘీభావం తెలిపేవారు పాదయాత్రలో ముందు, వెనుకా నడిచేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ణప్తి చేశారు. పాదయాత్రను అడ్డుకొంటామని పదే పదే మంత్రులు పేర్కొన్న నేపథ్యంలో వైకాపా నేతల నుండి రక్షణ కల్పించాలని కోర్టును అభ్యర్ధించారు. ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదిస్తూ రైతుల పిటిషన్లకు విచారణ అర్హత లేదన్నారు. పాదయాత్రకు ఇచ్చిన అనుమతిని రద్దుచేయాలని కోర్టును కోరారు. గుడివాడలో పోలీసులపై దౌర్జన్యం, ట్రాఫిక్ నిబంధనలు, రైతులు ఉల్లంగించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు ఇరు పక్షాల వారు సమర్పించిన వీడియో టేపులను పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు. Viveka Murder case: వివేకా హత్యపై, షర్మిల ఆరోపణలపై, వైకాపా శ్రేణుల మౌనం వెనుక ఉన్న మర్మం ఏంటి? తెదేపా నేత బొండా ఉమ

అమరావతి నుండి అరసవళ్లికి చేపట్టిన రాజధాని రైతుల పాదయాత్రను అడ్డుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసింది. అసభ్యకరమైన మాటలు, దూషణలు చేస్తూ రైతులను పదే పదే రెచ్చగొట్టారు. చివరకు పాదయాత్ర రైతుల పై కక్షపూరితంగా వాటర్ బాటిళ్లు, చెప్పులు విసరడంతో సమస్య కోర్టుకు చేరింది. పాదయాత్ర సాగిన ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం రాజధాని రైతులకు హారతులు ఇస్తూ వారికి స్వాగతాలు చెప్పారు. ఇక కోర్టు వెల్లడించనున్న తీర్పు పై ఇరుపక్షాలు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి.

ఇది కూడా చదవండి: MLA Maddisetty Venugopal: రాష్ట్ర ప్రభుత్వం పై దర్శి వైకాపా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్..

Exit mobile version