Gold Theft : ఉంగరం కొనడానికి అని మామూలుగానే జ్యుయలరీ షాప్ కు వచ్చిన దొంగ ఓనర్ ఉండగానే దాదాపు రూ.4 లక్షల విలువచేసే బంగారాన్ని దోచుకెళ్లిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లిలో స్వాతి జ్యూయలరీస్ షాప్ లో బంగారం కొనడానికి ఓ వ్యక్తి వచ్చాడు. ఉంగరాలు చూస్తున్నట్లు నాటకం ఆడి అదును చూసుకుని ఒక్కసారి బంగారు ఉంగరాల బాక్స్ ను తీసుకుని షాప్ బయటకు పరిగెత్తాడు. అప్పటికే బయట బైక్ తో సిద్ధంగా ఉన్న మరొకరితో కలిసి పరారైనట్లు షాప్ యజమాని తెలిపారు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దొంగల కోసం వెతుకుతున్నారు.
Gold Theft : ఉంగరం కొంటానని వచ్చి.. 4 లక్షల విలువైన బంగారాన్ని దోచుకెళ్లిన దొంగ.. ఓనర్ ఉండగానే !

Gold Theft in krishna district worth of 4 lakhs and news got viral