Site icon Prime9

MLA Gollababurao: వైకాపా ఎమ్మెల్యేకు గో బ్యాక్ నినాదాలతో స్వాగతం

Goback slogans welcomed Vaikapa MLA

Goback slogans welcomed Vaikapa MLA

Andhra Pradesh: కార్యకర్తల్ని, ప్రజా ప్రతినిధులను పట్టించుకోకుండా కాలర్ ఎగరేస్తే ఎంతటి వారికైనా భంగ పాటు తప్పదు. అధికార పార్టీ నేతలకైతే కొమ్ములొచ్చాయా అనుకొనేలా వైకాపా ఎమ్మెల్యేకు గో బ్యాక్ నినాదాలు స్వాగతం పలికిన ఆ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకొనింది.

సమాచారం మేరకు, వైఎస్ఆర్సీపి పార్టీ పాయకరావుపేట శాసనసభ్యులు బాబురావు వర్గానికి, రాయవరం ఎంపీపీ బొలిశెట్టి శారద, గోవిందరావు వర్గం మద్య విభేదాలు ఉన్నాయి. ఎన్. రాయవరం మండలం గుడివాడలోని అంగన్ వాడీ కేంద్రం ప్రారంభంతో పాటు నాడు-నేడు పనుల శంకుస్ధాపనకు ఎమ్మెల్యే బాబురావు విచ్చేసారు. ఈ క్రమంలో ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదు, ప్రభుత్వ కార్యక్రమాల పై తగిన సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని వైకాపా ఎంపీసీలు, సర్పంచులు ఎదురుతిరిగారు. ఎమ్మెల్యే కాన్వాయికి అడ్డుగా కూర్చొన్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు ఇచ్చారు. దీంతో పరిస్ధితి ఒక్కసారిగా మారిపోయి ఉద్రిక్తతకు దారితీసింది.

కాన్వాయి ముందు బైఠాయించిన గుడివాడ సర్పంచ్ శ్రీనుబాబు, వైస్ ఎంపీపీ చోడిపల్లి అప్పల్రాజు, జడ్పీటీసి సభ్యురాలు కాకర దేవి, ఇతర కొంతమంది నాయకులను పోలీసులు అడ్డుకొన్నారు. ఈ క్రమంలో పోలీసులు, వైకాపా అసమ్మతి నేతల మద్య తోపులాట జరిగింది. ఘటనలో శ్రీను గాయపడ్డాడు, కాకర దేవి, అపల్రాజు సొమ్మసిలి పడిపోయారు. అనంతరం పోలీసుల భద్రత నడుమ ఎమ్మెల్యే బాబూరావు శంకుస్ధాపన పనులకు టెంకాయి కొట్టి అక్కడ నుండి రక్షణతో తిరుగు ప్రయాణమైనారు.

ఒక దశలో అసమ్మతి వర్గం మద్యలో ఇరుక్కుపోయిన బాబూరావును రక్షించేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. ఈ మద్య కాలంలో దళిత శాసనసభ్యుడిని కించపరిచేలా అసమ్మతి వర్గం మాట్లాడడం పై రెండు వర్గాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి మీకెక్కడదని ప్రశ్నిస్తూ సమస్యను జఠిలం చేసుకొని వున్నారు. తాజాగా బొలిశెట్టి వర్గం ఎమ్మెల్యే బాబూరావును అడ్డుకోవడంతో వైకాపాలో ఉన్న విభేధాలు కాస్తా ఒక్కసారిగా రోడ్డెక్కాయి.

Exit mobile version