Site icon Prime9

Kodi kathi Case: కోడికత్తి నిందితుడి బెయిల్ కోసం నిరాహారదీక్ష? ఎక్కడంటే

For the bail of the accused in the Kodikatthi case, the family member will go on a fast

For the bail of the accused in the Kodikatthi case, the family member will go on a fast

Andhra Pradesh: ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి పై దాడి చేసిన కోడికత్తి హత్యాయత్నం కేసులో నిందుతుడుగా ఉన్న జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ కోసం అతని తల్లి నిరాహారదీక్ష చేపట్టనుంది. ఈ నెల 25న తాడేపల్లిలోని సీఎం కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టేందుకు ఆమె సమాయత్తమౌతుంది.

బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేల్లంక గ్రామానికి చెందిన శ్రీనివాసరావు విశాఖ యువజన్ ఫుడ్ క్యాంటిన్ లో సర్వర్ బాయ్ గా పనిచేసేవాడు. 2018 అక్టోబర్ 25న వైజాగ్ ఎయిర్ పోర్టులో సీఎం జగన్ పై కోడికత్తితో దాడికి పాల్పొడ్డాడు. దీనిపై పోలీసులతోపాటు ఎన్ఐఏ అధికారులు కూడా కేసు నమోదు చేసివున్నారు.

కేసు విచారణ తరువాత 2019 మే 25న శ్రీనివాసరావుకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే విచారణ నిమిత్తం మళ్లీ 2019 ఆగస్టు 13న ఎన్‌ఐఏ అధికారులు శ్రీనివాసరావు బెయిల్‌ రద్దు చేయించి రిమాండు లోకి తీసుకున్నారు. అప్పటి నుంచి శ్రీనివాసరావు సెంట్రల్‌ జైలులోనే రిమాండు ఖైదీగా ఉన్నాడు.

తల్లితండ్రుల సావిత్రి, తాతారావులు తాము వృద్ధాప్యంలో ఉన్నామని, కుమారుడు నాలుగేళ్లుగా జైలులో మగ్గిపోతున్నాడని, తమను చూసేవారు లేరని, తమ కుమారుడికి ఏం జరుగుతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు వెళ్లి శ్రీనివాసరావును కలిసి, నిరాహార దీక్ష ఎక్కడ చేపట్టేది నిర్ణయించుకోనున్నట్టు సోదరుడు సుబ్బరాజు తెలిపారు. అప్పట్లో కోడికత్తి కేసు పెద్ద సంచలనం సృష్టించింది. అయితే తాడేపల్లి వద్ద ఎవ్వరిని పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. కాని కోడికత్తి వ్యవహారంలో పోలీసులు ఏం నిర్ణయం తీసుకొంటారో తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Apsrtc: ఆర్టీసీ డ్రైవర్ నిర్వాకం.. నడి రోడ్డుపై బస్సును ఆపి పరార్

Exit mobile version