Site icon Prime9

Explosion In Anakapally: అనకాపల్లి జిల్లాలో భారీ పేలుడు

explosion-in-Anakapalli

Anakapally: ఏపీలోని అనకాపల్లి జిల్లాలో భారీ పేలుడు కలకలం రేపింది. సబ్బవరం మండలంలోని ఆరిపాక చిన్నయాత పాలెం గ్రామ సమీపంలోని బాణాసంచ తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. ఈ పేలుడులో నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

అయితే ఈ భారీ పేలుడుకు గోడౌన్లోని రహస్య ప్రాంతంలో ఓ ముఠా తిష్టవేసి బాణాసంచ తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ ముఠాలో కంచరపాలెంకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉండగా మరో ఇద్దరికి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

బాణాసంచ గోడౌన్లో ఉదయం వేళ వంట చేస్తుండగా మంటలు చెలరేగినట్లు అక్కడే ఉన్న మరికొంత మంది సిబ్బంది తెలిపారు. అక్కడే ఉన్న నలుగురు సిబ్బంది గాయాపడ్డారని పేర్కొన్నారు. క్షతగాత్రులను శంకర్‌రావు (48), కమలమ్మ (38), మహేశ్‌, ప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version