Site icon Prime9

Kothapalli Geetha Arrest: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను అరెస్ట్ చేసిన సీబీఐ

Kothapalli-Geetha-Arrest

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ కు చెందిన అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను బుధవారం నాడు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఆమెను అరెస్ట్ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి రుణం తీసుకుని రుణం చెల్లించని కేసులో గీతను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే గీత అరెస్టును సీబీఐ అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

హైదరాబాదులోని బంజారాహిల్స్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 52 కోట్ల రూపాయల రుణం తీసుకుని తిరిగి చెల్లించని నేపథ్యంలో గీత పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పేరుతో రుణం తీసుకున్న గీత దంపతులు బ్యాంకుకు ఎగనామం పెట్టారు. గీతను విచారణ నిమిత్తం బెంగళూరుకు తరలించింది సీబీఐ.

Exit mobile version