Chittoor: తెదేపా నేత, మాజీ మంత్రి నారాయణకు చిత్తూరు 9వ అదనపు జిల్లా కోర్టు బెయిల్ రద్దు చేసింది. పదవ తరగతి పరీక్షా పత్రాల లీక్ కేసులో బెయిల్ పై మంత్రి నారాయణ ఉన్నారు. నవంబర్ 30 లోపు పోలీసులకు లొంగిపోవాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
టెన్త్ పరిక్షా పత్రాలు లీకేజి కేసులో మాజీ మంత్రి నారాయణను ఈ ఏడాది ఏప్రిల్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆయనకు బెయిల్ మంజూరైంది. కింద కోర్టు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్ధానం నారాయణ బెయిల్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశాలతో ప్రతిపక్షాలపై పెట్టిన అనేక కేసులో ఇది కూడా ఒకటిగా అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపించి వున్నాయి.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతి కేసు పై దృష్టి.. పవన్ కల్యాణ్