Amaravati: అమరావతి అసైన్డ్ భూముల కేసులో నారాయణకు హైకోర్టు మూడు నెలల ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు. నారాయణ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని కోర్టుకు తెలిపారు. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
అయితే ప్రభుత్వం తరఫు వాదనలు వినిపించిన న్యాయవాది, కేసులో నారాయణ కీలక నిందితుడని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కేసులో బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, నారాయణకు మూడు నెలల ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలుకు సంబంధించి మాజీ మంత్రి నారాయణకు సహచరులుగా భావిస్తున్న ఐదుగురిని సీఐడీ మంగళవారం అరెస్టు చేసింది.
రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడకు చెందిన కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, విశాఖపట్నంకు చెందిన చిక్కాల విజయ సారధి, బడే ఆంజనేయులు, కొట్టి కృష్ణ దొరబాబులను అరెస్టు చేసినట్లు సీఐడీ అధికారిక ప్రకటనలో తెలిపింది.