Election Commission : ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే దొంగ ఓట్లు ఎక్కువగా నమోదవుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు తాజాగా ఆయన ఫిర్యాదుకు ఎలక్షన్ కమిషన్ సమాధానం ఇచ్చింది. ఎంపీ రఘురామకు ఒక లేఖను పంపినట్లు తెలుస్తుంది. ఆ లేఖ ప్రకారం 24,61,676 దొంగ ఓట్లు నమోదైనట్టు గుర్తించామని సమాచారం పంపింది. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
అలానే జీరో ఇంటి నెంబరుతో 2,51,767 ఓట్లు ఉన్నట్టు వివరించింది. ఒకే డోర్ నెంబరుతో పది అంతకు మించి ఓట్లు కలిగి ఉన్న ఇళ్లు 1,57,939 అని ఈసీ ఏర్కొంది. ఒకే డోర్ నెంబరు కలిగిన ఓట్లు 24,61,676 ఉన్నట్టు గుర్తించామని వెల్లడించింది. పది ఓట్లకు మించి ఒకే డోర్ నెంబర్ పై నమోదైన ఇళ్ళ నుండి 21,347 ఇళ్ళను తొలగించామని సమాధానం పంపింది. మిగిలిన వాటిపై చర్యలు తీసుకుని అర్హత లేని ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని, ఇకపై ఇటువంటి దొంగ ఓట్లు నమోదు కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.