Site icon Prime9

Daggubati Purandeswari : ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన పురందేశ్వరి.. వైసీపీపై ఫైర్

daggubati purandeswari taking charge as ap bjp president

daggubati purandeswari taking charge as ap bjp president

Daggubati Purandeswari : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు తాజాగా విజయవాడ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె తన ఛాంబర్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆమెకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాన్ని అందించి.. అభినందనలు తెలియజేశారు. పురందేశ్వరి అధ్యక్ష బాధ్యతల కార్యక్రమానికి పలువురు కీలక నేతలు హాజరయ్యారు. మరోవైపు పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

రాష్ట్రంలో రహదారుల పరిస్థితి దారుణంగా ఉందని.. కేంద్ర ప్రభుత్వ చలవతోనే రాష్ట్రంలో రహదారులు నిర్మితమవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రహదారిని కూడా వేయలేదని అన్నారు. ఒక్క ఏపీకే కేంద్ర ప్రభుత్వం 22 లక్షల ఇళ్లను ఇచ్చిందని పురందేశ్వరి తెలిపారు. రాష్ట్రంలో 35 శాతం ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి కాలేదని, దీనిపై పేదలకు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న కంపెనీలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని.. విభజన చట్టంలో పేర్కొన్న కేంద్ర విద్యా సంస్థలను రెండేళ్లలోనే దాదాపు అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని చెప్పారు.

 

 

రాష్ట్రంలో పలు ఎయిర్ పోర్టులను కూడా కేంద్రం నిర్మించిందని అన్నారు. ఏపీలో పలు చోట్ల ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తేనే ఇది సాధ్యపడుతుందని.. కానీ, రాష్ట్రం నుంచి ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా దాదాపు 80 కోట్ల మందికి ప్రతి నెల 5 కేజీల బియ్యం, ఒక కిలో పప్పును ప్రధాని మోదీ అందిస్తున్నారని ఆమె (Daggubati Purandeswari ) తెలిపారు. ఈ  కార్యక్రమం ద్వారా ఏపీలో 90 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని.. ఇటీవలే రూ. 12 వేల కోట్లను విడుదల చేసిందని తెలిపారు. పోలవరం కట్టడం చేతకాకపోతే కేంద్రానికి అప్పగించాలని అన్నారు. చిన్నచిన్న కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించలేని దుస్థితి ఎందుకు నెలకొందని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ప్రతి రైతుకు రూ. 12 వేలు ఇస్తానన్న జగన్ హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ అభివృద్ధికి కృషి చేస్తానని.. పార్టీ నేతలు, కార్యకర్తల సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు.

Exit mobile version